నిర్మల్ చైన్‌గేట్, జూన్ 24 : ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి భరోసా కల్పిస్తున్నదని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. ప్రభుత్వ దవాఖానకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ గుర్తింపు రావడం పట్ల శుక్రవారం ఆయన జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి సందర్శించారు. వైద్య సిబ్బందితో సమావేశమై వైద్య సేవలపై ఆరాతీశారు.
జిల్లా దవాఖానకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం హర్షణీయమని వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పాలనాధికారి చొరవతో నాణ్యతా ప్రమాణాల్లో మొదటి స్థానం లభించిందన్నారు. సమావేశంలో సూపరింటెండెంట్ డా. దేవేందర్‌రెడ్డి, ఆర్ఎంవో వేణుగోపాలకృష్ణ, నర్సింగ్ సూపరింటెండెంట్ భారతి కృష్ణవేణి, డా.రజని, హెడ్‌నర్సు శోభ, ప్రోగ్రాం అధికారి డా.అమీన పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన దవాఖానకు ఎన్‌క్యాష్ సర్టిఫికెట్ లభించడం సంతోషకరమని జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. జిల్లా దవాఖానను వారు సందర్శించి పలు వార్డులను పరిశీలించారు. రోగుల వద్దకు వెళ్లి వైద్య సదుపాయాలు, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.