హాజీపూర్, జూన్ 16 : హరితహారానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. మండలంలోని వేంపల్లి, బుద్దిపల్లిలో పల్లె ప్రగతి పనుల వివరాలను ఆయా గ్రామాల సర్పంచ్‌లను అడిగి తెలుసుకున్నారు. హరితహారం కార్యక్రమానికి మొక్కలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎంపీడీవో అబ్దుల్ హై, ఎంపీవో శ్రీనివాస్ రెడ్డి, వేంపల్లి సర్పంచ్ ఓలపు శారద-రమేశ్, బుద్దిపల్లి సర్పంచ్ అన్నం మధుసూదన్ రెడ్డి, ఆయా పంచాయతీల కార్యదర్శులు,సిబ్బంది పాల్గొన్నారు.
పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, సహాయ పంచాయతీ అధికారులతో గురువారం సాయం త్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హరితహారానికి మొక్కలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.విష జ్వరాలు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
జన్నారం, జూన్ 16 : జన్నారం, కలమడుగు,మురిమడుగు, కిష్టాపూర్‌లో పల్లె ప్రగతి పనులను జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్ కిషన్, ఎంపీవో రమేశ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట,జూన్16: మండలంలోని కొత్త కొమ్ముగూడెంలో పల్లె ప్రగతి పనులను జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. డంప్‌యార్డు, క్రీడా ప్రాంగణ స్థలాన్ని పరిశీలించారు. కొన్ని రోజులుగా వివాదంలో ఉన్న క్రీడా ప్రాంగణ స్థల సమస్యను పరిష్కరించారు. ఆయన వెంట ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, ఎంపీవో విజయప్రసాద్, సర్పంచ్ రాజేశం, కార్యదర్శి వరుణ్ ఉన్నారు.
తాండూర్, జూన్ 16 : మండలంలోని 15 పంచాయతీల్లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీవో సత్యనారాయణ, ఏపీవో నందకుమార్, ప్రజాప్రతినిధులు డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను పరిశీలించారు. కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
నెన్నెల, జూన్16: పంచాయతీల్లోని నర్సరీల్లో ఉన్న ప్రతి మొక్కనూ హరితహారం కార్యక్రమంలో నాటాలని జడ్పీ సీఈవో నరేందర్ అధికారులకు సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఘన్‌పూర్‌లో చేపట్టిన పనులను గురువారం పరిశీలించారు. నర్సరీని చూశారు. ఆయన వెంట సర్పంచ్ పంజాల లక్ష్మి, ఎంపీడీవో వరలక్ష్మి, ఏపీవో నవీన్, ఎంపీవో శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సాగర్‌గౌడ్,కార్యదర్శి ,వార్డు సభ్యులు ఉన్నారు.
కోటపల్లి, జూన్ 16 : మండలంలో పల్లె ప్రగతి కొనసాగుతున్నది. లక్ష్మీపూర్, వెల్మమపల్లి, రాపనపల్లిలో పారిశుధ్య పనులను ఎంపీవో అక్తర్ మొహియొద్దీన్ పరిశీలించారు. రాజారంలో సర్పంచ్ కొంక పోసక్క, ఉప సర్పంచ్ తిరుపతి రావు, కార్యదర్శి తిరుపతి ఆధ్వర్యంలో కరంటు స్తంభాలు వేయించారు. రొయ్యలపల్లిలో సర్పంచ్ రజిత, కార్యదర్శి చెన్న శ్రీవిద్య ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. సర్పంచ్‌లు పానెం శంకర్, గోనె సత్యనారాయణ, గుర్రం లక్ష్మీరాజన్న, కార్యదర్శులు రవి కుమార్, తనుగుల శైలజ, కమల్ పాల్గొన్నారు.
వేమనపల్లి, జూన్ 16 : మండల కేంద్రంలోని మంగళివాడలో పారిశుధ్య పనులను ఎంపీడీవో లక్ష్మయ్య పరిశీలించారు. ఆయన వెంట కార్యక్రమంలో ఏపీవో సత్య ప్రసాద్, సర్పంచు మధుకర్, కార్యదర్శి శ్యాంచంద్ పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, కార్యదర్శుల ఆధ్వర్యంలో పల్లె ప్రగతి పనులు కొనసాగాయి.
వార్డుల్లో అధికారుల పర్యటన
మంచిర్యాలటౌన్, జూన్ 16: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాలలోని 25, 36 వార్డుల్లో నాయకులు,అధికారులు పర్యటించారు. వార్డుల్లో ప్రత్యేకంగా పారిశుధ్య పనులు చేపట్టారు. రాముని చెరువు మత్తడి కాలువలో పూడిక తొలగించారు. బెల్లంపల్లి చౌరస్తా వద్ద చెత్తాచెదారాన్ని తొలగించారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్, కమిషనర్ బాలకృష్ణ, టీపీవో సత్యనారాయణ, ఏఈ నర్సింహస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్‌రాథోడ్ పాల్గొన్నారు.
శ్రీరాంపూర్, జూన్ 16 : పట్టణ ప్రగతిలో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీలోని ఆర్కే-8 కాలనీ, భగత్‌సింగ్‌నగర్‌లో కౌన్సిలర్ పూదరి కుమార్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ సీపతి సతీశ్, సిబ్బంది పాల్గొన్నారు.
లక్షెట్టిపేట, జూన్16: పట్టణంలోని 7,8,13,14వ వార్డుల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు ఎంపిక చేసిన స్థలాలను శుభ్రం చేయించారు. కమిషనర్ ఆకుల వెంకటేశ్, కౌన్సిలర్లు రాందేని వెంకటేశ్, మెట్టు కల్యాణి రాజు, చింత సువర్ణ అశోక్, రాందేని సత్తవ్వ, మున్సిపల్ మేనేజర్ శ్రీహరి, సిబ్బంది ఉన్నారు.
మందమర్రి, జూన్ 16: మందమర్రి మున్సిపాలిటీ, మండలంలో కొనసాగుతున్న పట్టణ, పల్లె ప్రగతి పనులను టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు పర్యవేక్షించారు. మందమర్రి, క్యాతనపల్లి మున్సిపల్ పరిధి గద్దరాగడిలోని డ్రైనేజీల్లో పూడికను తొలగించారు. కార్యక్రమంలో మందమర్రి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఏఈ అచ్యుత్, టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు పారిపెల్లి తిరుపతి, అలుగుల శ్రీలత, సత్తయ్య, మున్సిపల్ సిబ్బంది నాగరాజు పాల్గొన్నారు.