మంచిర్యాల అర్బన్, జనవరి 12 : యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ఆయ న అడుగుజాడల్లో నడవాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సైన్స్ సెం టర్లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయ న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివేకానందుడి చిత్ర పటానికి పూలమాల వేసిన అనంతరం యువతనుద్దేశించి మాట్లాడారు.
యువతీ యువకులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని కోరారు. అనంతరం వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి శాలువాలు, మెమొంటోలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ సం దర్భంగా చిన్నారి అఖీరా జాను చేసిన నృ త్యం చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ కా ర్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్, జిల్లా వయోజన విద్యాశాఖాధికారి పురుషోత్తం నాయక్, యువజన సంఘాల సభ్యులు అభినవ సం తోష్ కుమార్, యువతరం తిరుపతి, తగరపు సత్తయ్య, బొమ్మల మహేశ్, స్నేహ రమేశ్, సంతోష్ గుప్తా, బత్తుల వాసు పాల్గొన్నారు.