దండేపల్లి, (లక్షెట్టిపేట), ఫిబ్రవరి 10 : మహిళలు కుట్టు శిక్షణలో నైపుణ్యం సాధించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోతీలాల్ అన్నారు. జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్వంలో చందారం గ్రామంలో కుట్టు శిక్షణలో నైపుణ్యం సాధించిన మహిళలకు శనివారం పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కుట్టు శిక్షణలో నైపుణ్యం కనబర్చినవారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. జిల్లా వయోజన విద్యాశాఖ ప్రాజెక్టు అధికారి పురుషోత్తం నాయక్, తహసీల్దార్ రాఘవేంద్రరావు, డీఆర్పీలు కొండు జనార్దన్, వెంకటేశ్వర్లు, అశోక్‌రావు, హెచ్ఎం హరినాథ్, శిక్షకురాలు మంజుల పాల్గొన్నారు.