కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల శివారులోని సర్వే నెంబర్ 8లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను( Indiramma House) నిర్మించుకోనియకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు ( Action ) తీసుకోవాలని పోలవేణి తిరుపతి ( Polaveni Tirupati ) దంపతులు కోరారు. ఈ మేరకు సోమవారం కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి( Prajavani ) లో ఫిర్యాదు చేశారు.
తండ్రి వారసత్వంగా వచ్చిన భూమిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టగా పెద్దనాన్న మనవడు, అతని బావమర్ది అడ్డుకొని హద్దులను తొలగించారని ఆరోపించఆరు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేసే వరకు ఎవరూ కూడా హద్దులు దాటవద్దని హెచ్చరించారని పేర్కొన్నారు.
తమకు సమాచారం లేకుండానే విచారణ పేరుతో రాజకీయ అండదండలతో తమ ఇళ్లపైకి వెళ్తున్నారని వాపోయారు. అధికారులు చర్యలు తీసుకొని ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేసుకునే విధంగా తమకు సహకరించాలని కోరారు.