నాడు వారి ప్రాణ త్యాగఫలమే..
ఒకప్పటి పోలీసుల ప్రాణత్యాగాల ఫలితమే ఇ ప్పటి ప్రశాంతమైన జిల్లాకు కారణమని జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(ఫ్లాగ్ డే) సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్సలో రక్తదాన శిబిరం ఏ ర్పాటు చేశారు.
- నేటి ప్రశాంత జిల్లాకు కారణం
- ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
- 57 మంది అమరవీరుల ముఖచిత్రాలతో స్థూపం ఏర్పాటు
ఎదులాపురం,అక్టోబర్ 17: ఒకప్పటి పోలీసుల ప్రాణత్యాగాల ఫలితమే ఇ ప్పటి ప్రశాంతమైన జిల్లాకు కారణమని జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(ఫ్లాగ్ డే) సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్సలో రక్తదాన శిబిరం ఏ ర్పాటు చేశారు. ముందుగా జిల్లా ఎస్పీ అమరవీరుల స్తూపం చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రక్తదాన శిబిరన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 57 మంది పోలీసుల ప్రాణత్యాగాలు ఇప్పుడు ప్రశాంతమైన జిల్లాకు కారణమని గుర్తుచేశారు. వారి సంస్మరణ సందర్భంగా జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో అమరవీరుల ముఖచిత్రాలతో నూతన స్తూపాన్ని ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆదేవిధంగా ఈ రక్తదానం శిబిరం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరం ఎక్కువ గా ఉన్నందున, ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం శుభపరిణామ మన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి సిబ్బంది, పట్టణంలో వివిధ వార్డులకు సంబంధించిన ప్రజలు, యువజన సంఘాలు,ఉద్యోగులు 152 మందితో పాటు జిల్లా ఎస్పీ రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా దివ్యాంగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సీ సమయ్‌జాన్‌రావు, డీఎస్పీ వీ ఉమేందర్, ఉట్నూర్ డీఎస్పీ సీహెచ్ నాగేందర్, వర్టికల్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు కే.సత్యానారాయణ, ఏ.అశోక్, ప్రణయ్ కుమార్, చంద్రశేఖర్, ప్రేమ్ కుమార్, శ్రీనివాస్, ఆర్ఐ సీఐలు నవీన్ కుమార్, టీ.మురళి,కార్తీక్, స్వామి రిమ్స్ వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

