బజార్ హత్నూర్ : మండల కేంద్రంలో జొన్నల కేంద్రం సబ్ సెంటర్ (Sorghum center ) ను ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ( Mla Anil Jadav ) కు బజార్ హత్నూర్ రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా రైతులు శేఖర్ మాట్లాడుతూ మండలంలోని 30 గ్రామపంచాయతీ లలో రైతులు పండించిన జొన్నలు ఇచ్చోడా మార్కెట్ వెళ్లి అమ్మాలంటే దూరం భారంగా మారిందన్నారు.
బజార్హత్నూర్ (Bazar Hatnoor ) మండల కేంద్రంలో సబ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తే రైతులకు సౌకర్యం గా ఉంటుంది కోరారు. ఎమ్మెల్యే స్పందించి మార్కుఫెడ్ డీఎం తో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మండల యువకులు తోకల లింగన్న, ముడుగుల సురేష్, కల్వ సుకుమార్, షఫీ తదితరులు పాల్గొన్నారు.