Adilabad | ఆదిలాబాద్ : అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని భార్యను చంపేశాడు.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్లో శనివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గుడిహత్నూర్ గ్రామానికి చెందిన లతపతే మారుతి(36), కీర్తి(30)కి కొన్నేండ్ల క్రితం వివాహమైంది. మారుతి డెయిరీ ఫామ్ ఓనర్ కాగా, భార్య ఇంటి వద్దే ఉంటుంది. మారుతి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో భార్య ప్రశ్నించగా, ఆమెను గురువారం చంపేశాడు. అనంతరం తప్పించుకుని పారిపోయాడు.
ఇక శనివారం ఉదయం మారుతి గ్రామ శివార్లలో శవమై తేలాడు. మారుతి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మారుతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడి తండ్రి జగన్నాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.