మందమర్రి,ఆగస్టు 25 : మందమర్రి ము న్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు గాంధీనగ ర్ ఏరియాలో ఆదివారం భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. కాలనీకి చెందిన తు మ్మ రవీందర్ ఇంటి ఆవరణలోకి ఆదివారం ఉదయం కొండ చిలువ రావడంతో కుటుం బ సభ్యులు భయపడిపోయారు. అప్పటికే అది పిల్లిని మింగిందని వారు తెలిపారు. సిం గరేణి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు మ హేందర్, శ్రీనివాస్ అక్కడికి చేరుకొని కొండచిలువను పట్టుకున్నారు. ఆపై అటవీ ప్రాం తంలో వదిలేశారు. 10 అడుగులకు పైగా పొడవు ఉంటుందని తెలిపారు. కొండచిలువను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పాములు కనిపిస్తే 88970 17110లో సంప్రదించాలని కోరారు.
శివాజీనగర్‌లో..
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రామకృష్ణాపూర్ శివాజీనగర్ కాలనీలో ఆదివారం సాయంత్రం కొండ చిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాలనీలోని చెట్ల పొదల నుంచి నివాస ప్రాంతాలకు వచ్చిన కొండ చిలువ స్థానికులపై దాడి చేసేందుకు యత్నించడంతో తప్పనిసరి పరిస్థితిలో కొండ చిలువను కొట్టి చంపినట్లు కాలనీ వాసులు తెలిపారు. అధికారులు కాలనీలో పేరుకు పోయిన చెట్ల పొదలను తొలగించాలని వారు కోరారు.