రెబ్బెన, జనవరి 12 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని కాగజ్నగర్ క్రాస్ రోడ్డువద్దనున్న కాటన్ మిల్లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఓ ట్రాక్టర్ పత్తిలోడ్తో కాటన్ మిల్కు వచ్చింది. పత్తిని దింపిన తర్వాత ట్రాక్టర్ స్టార్ట్ చేసే క్రమంలో దాని ఇంజిన్ నుంచి నిప్పురవ్వలు రావడంతో అక్కడున్న పత్తికి అంటుకుంది.
దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మిల్ నిర్వాహకులు వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. రెండు ఫైరింజన్లు హుటాహుటిని అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అప్పటికే 2300 క్వింటాళ్ల పత్తి, 94 పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 2 కోట్లకు పైగా ఉంటుందని మిల్యాజమాన్యం తెలిపింది.