హాజీపూర్, డిసెంబర్ 17 : మండలంలోని రాపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు కునారపు రామయ్య గోదావరిలో చేపల కోసం ఏర్పాటు చేసిన బుట్టలో తీసి చూడగా అందులో ఒక అడుగు మొసలి పిల్ల కనిపించింది. దీంతో భయబ్రాంతులకు గురైన కునారపు రాజయ్య చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు. స్థానికులతో కలిసి గోదావరిలో ఉన్న బుట్టను ఇంటికి తీసుకువచ్చారు. స్థానికులు డిప్యూటీ రేంజ్ అధికారి సునీతకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న డిప్యూటీ రేంజ్, అటవీ శాఖ అధికారులు మొసలి పిల్లను స్వాధీనం చేసుకొని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వదిలిపెట్టారు. బుట్టలో చిక్కుక్కున్న మొసలి పిల్ల బరువు ఆరు కిలోల వరకు ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.