e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home ఆదిలాబాద్ మెరుగైన వైద్య సేవలు

మెరుగైన వైద్య సేవలు

ఏరియా దవాఖానల్లో కార్పొరేట్‌కు దీటుగా సదుపాయాలు
తగ్గనున్న దూర, వ్యయభారం
డైరెక్టర్లు ఎన్‌ బలరాం, డీ సత్యనారాయణరావు
ఆర్కేపీ ఏరియా దవాఖానలో సీటీ స్కాన్‌ ప్రారంభం

రామకృష్ణాపూర్‌, నవంబర్‌ 29 : కార్పొరేట్‌కు దీటుగా సింగరేణి ఏరియా దవాఖానల్లో సంస్థ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నదని డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, ప్రాజెక్ట్‌ అండ్‌ ప్లానింగ్‌) ఎన్‌ బలరాం, డైరెక్టర్‌ (ఈ అండ్‌ ఎం) డీ సత్యనారాయణరావు అన్నారు. మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్‌ ఏరియా దవాఖానలో రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ యంత్రాన్ని సోమవారం టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీ సీతారామయ్య, ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌, సీఎంవో ఎంహెచ్‌ కొత్తగూడెం మాంత శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడారు. కార్పొరేట్‌ దవాఖానల్లో మాదిరిగా సింగరేణిలోని అన్ని ఏరియా దవాఖానల్లో సదుపాయాలు కల్పించాలని సీఎండీ శ్రీధర్‌ ఆదేశించారన్నారు. ఈ మేరకు రామకృష్ణాపూర్‌ ఏరియా దవాఖానలో ఈ సీటీ స్కాన్‌ యంత్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతి నెలా సుమారు 3 వేల మందిని వేరే దవాఖానలకు రెఫర్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సిటీ స్కాన్‌ యంత్రంతో ఏరియా దవాఖానలోనే మెరుగైన వైద్యం అందుతుందన్నారు. అలాగే వ్యయ భారం కూడా తగ్గుతుందని తెలిపారు. అనంతరం మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లోని ఉద్యోగులకు ఈ స్కానింగ్‌ సెంటర్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి నుంచి సీటీ స్కాన్‌ కోసం వేరే దవాఖానలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుందన్నారు. ఈ సీటీ స్కాన్‌ సెంటర్‌ను రామకృష్ణాపూర్‌ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసినందుకు చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ శ్రీధర్‌కు, ప్రారంభోత్సవానికి హాజరైన డైరెక్టర్లకు, కార్మిక సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియచేశారు. టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌, ఏఐటీయూసీ బ్రాంచ్‌ ఎస్‌ సత్యనారాయణ, డీవై సీఎంవో డాక్టర్‌ ఉష, ఇన్‌చార్జి మేనేజర్‌ ఎస్‌ శ్యామ్‌సుందర్‌, ఏరియా అధికారులు, దవాఖాన మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారమేశ్‌, వైద్యులు, కార్మిక సంఘాల నాయకులు, దవాఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement