
జైనథ్, జనవరి28 :దళితబస్తీ పథకంతో అర్హులైన ఎస్సీ కుటుంబాల్లో భరోసా నెలకొన్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో జైనథ్ మండలం పిప్పర్వాడ గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రెండు ఎకరాల చొప్పున మొత్తం 6 ఎకరాల భూమికి సంబంధించిన పట్టా పాసుపుస్తకాలను శుక్ర వారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తోనే ఎన్నో పేద కు టుంబాలకు మేలు జరుగుతున్నాదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్, టీఆ ర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి , రైతుబంధు సమితి కన్వీనర్ లింగారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ తల్లెల చంద్రయ్య, సర్పంచ్ సంతోష్‌రెడ్డి , నాయకులు రాజారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, జైనథ్ నాయకులు లింగారెడ్డి, గోవర్ధన్, వెంకట్ రెడ్డి, నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం కల్యాణలక్ష్మి..
ఆదిలాబాద్ రూరల్, జనవరి 28: నిరుపేద ఆడబిడ్డల తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి పథకం వరంలాంటిదని ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎంపీపీ సెవ్వ లక్ష్మి, జగదీశ్,ఎంపీటీసీ గంగాధర్, మల్లయ్య పాల్గొన్నారు.