
ఇచ్చోడ, జనవరి 24: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనాల పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వనాల పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇచ్చోడలో పరిశుభ్రత మరింత పాటించాలన్నారు. సమావేశంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, డీఎల్పీవో ధర్మారాణి, ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీవో రమేశ్, ఈజీఎస్ ఏపీవో నరేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
జంగుబాయి ఆడియో సీడీ ఆవిష్కరణ
ఆదివాసుల ఆరాధ్యదైవం జై జంగో.. జై లింగో పేనే జంగుబాయిరా అనే పాట ఆడియో సీడీని మండల పరిషత్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబార్పేట గ్రామానికి చెందిన రేలా రేలా సింగర్ కాత్లే శ్రీధర్ పాడడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో దుబార్పేట సర్పంచ్ అభిమాన్, ఆదివాసీ యువకులు, తదితరులు పాల్గొన్నారు.