
పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
వినాయక్ సిటీ స్కాన్, డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం
నిర్మల్ చైన్‌గేట్, నవంబర్ 22 : పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల పరీక్షలు నిర్వహించేలా అత్యాధునిక డయాగ్నోస్టిక్ సెంటర్లు నిర్మల్‌కు వచ్చాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని సూర్య దవాఖాన వద్ద అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన వినాయక్ సిటీ స్కాన్, డయాగ్నోస్టిక్ సెంటర్‌ను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసగర్‌రావు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలకే ఆరోగ్య పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రజాప్రతినిధులను సెంటర్ నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ప్యాక్స్ చైర్మన్ దర్మాజీ రాజేందర్, నాయకులు అల్లోల మురళీధర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ముత్యం రెడ్డి, స్థానిక కౌన్సిలర్ రామగోని తులసి నర్సాగౌడ్, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, భూషణ్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.