
దండేపల్లి, నవంబర్ 22: గూడెం శ్రీసత్యనారాయణ స్వామిని సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వదించగా, ఆలయ ఈవో వడ్లూరి అనూష స్వామివారిని చిత్రపటాన్ని బహూకరించి, తీర్థ ప్రసాదాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సత్యనారాయణస్వామి వ్రతంచేశారు. ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, జూనియర్ అసిస్టెంట్లు కేవీ సత్యనారాయణ, అంజయ్య, ప్రధాన అర్చకులు రఘుస్వామి, సంపత్‌స్వామి, వేదపండితుడు నారాయణశర్మ, సిబ్బంది ఉన్నారు.
హన్మాన్ విగ్రహ ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన
సీసీసీ నస్పూర్, నవంబర్ 22: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లపల్లి పునరావాస కాలనీలో నిర్మించిన శ్రీభక్తాంజనేయస్వామి ఆలయంలో వేదపండితులు మనోహరశర్మ, అవధాని బృందం ఆధ్వర్యంలో విగ్రహాలు, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమం చేశారు. ఈ మహోత్సవానికి ఎమ్మెల్యే దివాకర్‌రావు, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పురుషోత్తంరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అక్కూరి సుబ్బయ్య, రుకుం తిరుమల్, అగ్గి రాములు, ఐత శంకర్, అగ్గు తిరుపతి, జెట్టి రాజయ్య, అగ్గి తిరుపతి, బండారు చందు, ముదాం భీమేశ్, బండారు సురేశ్, నాయకులు దగ్గుల మధు, చెల్ల విక్రమ్, కాటం రాజు, పెంచాల వేణు, మహ్మద్ సోహెల్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.