
నిర్మల్ అర్బన్, ఆగస్టు 22 : పట్టణంలో వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నామని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నా రు. పట్టణంలోని షేక్షావ్పేట్ కాలనీలో ఆది వారం ఈశ్వర్ పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నీరు నిలవడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో కాలనీలో ఆయన పర్యటించారు. కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించా రు. కౌన్సిలర్ సయ్యద్ అబ్రార్ హుస్సేన్, నాయ కులు రఫత ఖాన్, అవత్, అజాం, అక్బర్, ఇమ్రా న్, సలీం, తమిన్, రహీం తదితరులున్నారు.
సొసైటీ సేవలు అభినందనీయం..
గ్లోబల్ ఎడ్యుకేషన్ సొసైటీ సేవలు అభినంద నీయమని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం లో ఉర్దూ అకాడమీ నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవా ర్డు అందుకున్న అనుసం హైమత్, ఉత్తమ సామా జిక సేవకు అన్వర్ పాషా, బాజీరొద్ద్దీన్, కలీం, యూసుఫ్ హైమద్, వసీమ్, ఫకీర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్‌ను సన్మానించారు. ఎస్టీయూ అధ్య క్షుడు గజేందర్, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎంసీ లింగన్న, కౌన్సిలర్ సలీం, అన్వర్ పా షా, అజారొద్దీన్, షేక్ జాకీర్, మహ్మద్ అబ్దుల్ మసూద్ తదితరులున్నారు.