మోడల్ స్కూల్‌ను తలపించేలా..
ఆకట్టుకుంటున్న భవనం
ఆకర్షించేలా రంగురంగుల బొమ్మలు
చిన్నారుల ఆటపాటల కోసం ప్లే గ్రౌండ్
దిలావర్పూర్, నవంబర్ 21 : మండలంలోని గుట్టలమీది గ్రామమైన మాడెగాంలో చిన్నారులను ఆకట్టుకునేలా మోడల్ అంగన్వాడీ భవనాన్ని అద్భుతంగా నిర్మించారు. ప్రైవేట్ మోడల్ స్కూళ్లను తలపించేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. అందమైన రంగులు, వేసి గోడలపై చిన్నారులను ఆకర్షించేలా బొమ్మలను గీశారు. పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్లో ఊయలలు, జారుడు బల్లలు ఏర్పాటు చేశారు. గదిలో ఆడుకునేందుకు అందమైన బొమ్మలు అందుబాటులో ఉంచారు. ఈ గ్రామం నుంచి నిర్మల్ పట్టణానికి మోడల్ బడికి పంపే చిన్నారులను తమ ఊరి అంగన్వాడీకే పంపిస్తున్నారని సర్పంచ్ సరిత పేర్కొంటున్నారు. భవనాన్ని మోడల్‌గా తయారు చేసేందుకు సహకరించిన ఎంపీవో అజీజ్‌ఖాన్‌ను గ్రామస్తులు, జిల్లా స్థాయి అధికారులు, మంత్రి ఐకేరెడ్డి సైతం అభినందించారు. ఈ కేంద్రాన్ని ఇటీవల అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే సైతం పరిశీలించారు. చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.