
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో టీఆర్ఎస్ సంబురాలు
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
ఖానాపూర్ రూరల్, నవంబర్ 20: సీఎం కేసీఆర్ మహాధర్నా చేపట్టిన 24గంటల్లోనే కేంద్రం దిగివచ్చి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంపై రైతులు, నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఏఎంసీ పుప్పాల శంకర్ అన్నారు. పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని చెప్పారు. రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దేశ రైతుల సమస్యలపై, కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దుకు, జాతీయ రైతు ఉద్యమానికి సమర శంఖం పూరించారన్నారు. దేశ రైతాం గ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారని గుర్తు చేశారు. అనంతరం మార్కెట్ యార్డులో రైతులతో మాట్లాడారు. వానకాలం పంట వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని భరో సా ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఖలీల్, మాజీ జడ్పీటీసీ రామునాయక్, కల్వకుంట్ల నారాయణ, కౌన్సిలర్లు కుర్మ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ అమంద శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజగంగన్న, పుప్పాల గజేందర్, కొక్కుల ప్రదీప్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పరిమి సురేశ్, జన్నారం శంకర్, రామిడి మహేశ్, పెద్దిరాజు, కేహెచ్ ఖాన్, షెడ్జిల్, మెహరాజ్, శైలేందర్, పడిగెల శేఖర్, ప్రవీణ్, రాజలింగం, మనోజ్, మణికం ఠ, ఎనుగుల రాజేశ్వర్, చంద్రవాస్, అంజ న్న, పెద్ది నర్సయ్య, విజయానంద్ పాల్గొన్నారు.
కడెం, నవంబర్ 20: కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరిపారు. మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్రం యాసంగి వడ్లను కొంటామని ప్రకటించకపోతే ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కుందనపెల్లి మల్లారెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫిక్ హైమద్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గోళ్ల వేణుగోపాల్, ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ముడికె మల్లేశ్ యాదవ్, నాయకులు రాముగౌడ్, కుమ్మరి రంజిత్, గౌసొద్దీన్, హసీబ్, నల్లగొండ, రవి, షర్ఫొద్దీన్, లక్ష్మణ్, రాజేశ్, రాజేశ్వర్‌గౌడ్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
దస్తురాబాద్, నవంబర్ 20: టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు ముడికె ఐలయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశా రు.రైతు మహాధర్నాలో సీఎం కేసీఆర్ హెచ్చరికలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజునాయక్, సర్పంచ్ దుర్గం శంకర్, నాయకులు సంతపురి శ్రీనివాస్,నిమ్మతోట శివయ్య, చెవులమద్ది నర్సయ్య, జుంబర్తి రాజన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.
జైనథ్, నవంబర్ 20 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఎస్.లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ టీ వెంకట్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి గణేశ్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, ఊశన్న, టీ చంద్రయ్య, వెంకట్‌రెడ్డి, దేవన్న, మల్లారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెంబి, నవంబర్ 20: మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, సర్పంచ్ పూర్ణచందర్ గౌడ్ మాట్లాడారు. యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతోనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ మండల కన్వీనర్ భుక్యా గోవింద్, కోఆప్షన్ మతీన్, నాయకులు కున్సోత్ విలాస్, గాండ్ల శంకర్, సుతారి మహేందర్, బడుగు మల్లేశ్, దేశరాజు నారాయణ, బాలాజీ, సోన్న రాజేందర్ ఉన్నారు.
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 20 : మావల మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు నల్లా రాజేశ్వర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చందాల రాన్న, దొగ్గలి రాజేశ్వర్, కిరణ్, మడావి నారాయణ,గోవర్ధన్, ఏవన్, ఉమాకాంత్ రెడ్డి, సృజన్, అభిమాన్, మోహన్, సంతోష్, గంగన్న పాల్గొన్నారు.
ఉట్నూర్,నవంబర్ 20 : ఉట్నూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కందుకూరి రమేశ్, పట్టణ అధ్యక్షుడు సాడిగె రాజ్‌కుమార్, ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు హైమద్ అజీమొద్దీన్, మాజీ మండలాధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు తన్నీరు సతీశ్, ఉపాధ్యక్షుడు కోడి బల్వంత్, ఉప సర్పంచ్ కోల సత్యం, నాయకులు కాలేరి రవి, బేరిగెడి మనోహర్, రాజన్న, రామారెడ్డి, ఉత్తమ్, భుజంగ్‌రావ్, రాజేశ్వర్, రవీందర్, న్యాను, నర్సింహులు పాల్గొన్నారు.