శనివారం 06 మార్చి 2021
Adilabad - Jan 23, 2021 , 00:58:04

అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయం

అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయం

  • రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • టోల్‌ప్లాజాలో మరుగుదొడ్ల నిర్వహణపై అసంతృప్తి

సోన్‌, జనవరి 22 : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసినప్పటికీ అన్ని వర్గాల అభ్యున్నతికి సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకెళ్లడం అభినందనీయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సోన్‌ మండలం గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా లారీ డ్రైవర్ల అసోసియేషన్‌ ఆ ధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. డ్రైవర్లకు, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన వాహనదారులను ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆరు నెలల వాహన పన్ను రూ.56 కోట్లను మాఫీ చేశారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిరోధానికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందని, ప్రజలు మాత్రం వైరస్‌ బారి నుంచి కాపాడుకునేందుకు మాస్క్‌లు, భౌతిక దూ రం పాటించాలని సూచించా రు. అనంతరం హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణపై మంత్రి అల్లోల అధికారులపై మండిపడ్డారు.  పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యం కల్పించడంలో ఎందుకు లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, ఎఫ్‌ఏసీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీగారి రాజేందర్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, రవాణాశాఖ అధికారి అజయ్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్‌ సందుగారి లావణ్య, నాయకులు పూదరి రాజేశ్వర్‌, అబుబాయి, ఆకోజి కిషన్‌, సోన్‌ సర్పం చ్‌ వినోద్‌, రాము, జగన్‌, గంగాధర్‌, టోల్‌ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు. 

మంత్రిని కలిసిన బాసర ఆలయ ఈవో

బాసర, జనవరి 22 : బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7.68 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా శుక్రవారం ఆలయ ఈవో వినోద్‌రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. నిధుల మంజూరుపై కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ వారి ప్రసాదాన్ని అందజేశారు.  

ఓడ్‌ కులస్తుల క్యాలెండర్‌ ఆవిష్కరణ

నిర్మల్‌ అర్బన్‌, జనవరి 22 : జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్ర భుత్వం కొత్తగా గుర్తించిన ఓడ్‌ కులస్తుల క్యాలెండర్‌ను రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు రాంకిషన్‌, సభ్యులు శంకర్‌, సంతోష్‌, అంజన్న, జాదవ్‌ రాజు, విజయ్‌, తిరుపతి, అశోక్‌, విఠల్‌, తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo