సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Mar 20, 2020 , 02:52:19

‘లక్కీ’ మోసం

‘లక్కీ’ మోసం

  • జిల్లాలో జోరుగా లక్కీడ్రా వ్యాపారం
  • రూ.కోట్లలో కొనసాగుతున్న దందా
  • ప్రతి నెలా డ్రా అంటూ ప్రచారం
  • డ్రాలో రాకపోయిన బహుమతులంటూ మోసం

కొనసాగుతున్నది. కొందరు ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట అక్రమ స్కీములను జోరుగా కొనసాగిస్తున్నారు. స్కీములు, లక్కీడ్రా పేరుతో ప్రజల డబ్బును కొందరు అక్రమంగా సంపాదించాలనే ఆశతో జేబులు నింపుకుంటున్నారు. నెలకు రూ.1,150 చొప్పున 15 నెలలు చెల్లించండి.. కారు గెలుచుకోండి.. కార్లు కాకుండా మోటర్‌ సైకిళ్లు, గోల్డ్‌కాయిన్లు, ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లతో పాటు గృహోపకరణాలను పొందవచ్చని బురిడీ కొట్టిస్తున్నారు. అందమైన బ్రోచర్లను ముద్రించి ఇక్కడి అమాయక ప్రజలను బుట్టలో వేసుకుంటున్నారు. బోథ్‌, తలమడుగు, ఇచ్చోడ, బజార్‌హత్నూర్‌, నేరడిగొండ మండలాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతున్నది. నిర్వాహకుల చేతిలో మోసపోయిన వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. 

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : సులభంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు జిల్లాలో లక్కీ డ్రా స్కీముల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారు. జిల్లాలోని బోథ్‌, తలమడుగు, ఇచ్చోడ, బజార్‌హత్నూర్‌, నేరడిగొండ మండలాల్లో ఈ దందా విచ్చల విడిగా సాగుతున్నది. కొందరు అక్రమార్కులు ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట అక్రమ స్కీముల దందాను జోరుగా కొనసాగిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట కరపత్రాలను ముద్రిస్తున్నారు. ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా గ్రామాల్లో ప్రజలను సభ్యులుగా చేర్చుకుంటున్నారు. ప్రతి నెలా 20 నుంచి 30 మందికి బహుమతులు ఇస్తామంటున్నారు. కార్లు, మోటార్‌సైకిళ్లతో పాటు  గోల్డ్‌కాయిన్లు, ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లతో పాటు గృహోపకరణాలను పొందవచ్చని పేదలు, మధ్యతరగతి వారిని మభ్యపెడుతున్నారు. చివరికి వారికి మాయమాటలు చెప్పి స్కీముల్లో సభ్యులుగా చేర్చించుకుంటున్నారు. ఇందులో సభ్యులుగా చేరిన వారు  15 నెలల పాటు ప్రతి ఒక్కరూ ప్రతి నెలా రూ.1,150 చెల్లించాల్సి ఉంటుంది. వివిధ బహుమతుల పేరిట ప్రతి నెలా డ్రా తీస్తూ ఫ్రిజ్‌ను మొదలుకొని మోటార్‌ సైకిల్‌ వరకు బహుమతులూ ఇస్తామంటూ మభ్యపెడుతున్నారు. లక్కీ డ్రాలో పేరు వెళ్లని వారికి చివరకు ఏదో బహుమతి ఇస్తామంటూ వారిని సభ్యులుగా చేర్పించుకుంటున్నారు. స్కీం కాల పరిమితి ముగిసిన అనంతరం ఎలాంటి బహుమతులు ఇవ్వడం లేదు. దీంతో పలువురు బాధితులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బోథ్‌లో ఓ దుకాణంపై ఇటీవల దాడులు నిర్వహించి సీజ్‌ చేశారు. 

3,666 మంది సభ్యులు...రూ. కోట్లలో దందా

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లక్కీ స్కీంల దందా కోట్లలో కొనసాగుతున్నది. ప్రతి ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం 3,666 మందికి తక్కువ కాకుండా సభ్యులను చేర్చుకుంటున్నారు. ఒక్కో సభ్యుడి నుంచి నెలకు రూ. 1,150 వసూలు చేస్తున్నారు. ఇలా 15 నెలలకు గాను  రూ. 17, 250, అదనంగా సభ్యత్వం రుసుము రూ. 200 వసూలు చేస్తున్నారు. ఒక్కో సభ్యుడి నుంచి నెలకు రూ.1,150 చొప్పున మొత్తం రూ. 42,15,900 గాను  15 నెలలకు రూ. ఆరు కోట్ల 32 లక్షల, 38 వేల 500 వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. వాయిదా పద్ధతిలో కొనసాగుతున్న లక్కీ స్కీమ్‌ వసూళ్ల కోసం ఏకంగా ఏజెంట్లను కూడా నియమించారు. వారికి నెలకు రూ.15 వేల గౌరవ వేతనం ఇస్తున్నారు. వారి వద్ద నుంచి బలవంతంగా ప్రతి నెలా రూ.1150 వసూలు చేస్తారు. ఏ ఒక్క నెల డబ్బులు చెల్లించకపోయినా.. వారి పేర్లను స్కీం సభ్యుల జాబితా నుంచి తొలగిస్తారు. గ్రామాల్లో ఇలాంటి స్కీంలో చేరిన వారు తమ పేర్లను ఎందుకు తొలగించాలని అడిగితే తమ అనుచరులతో వారిపై ఎదురుదాడికి దిగుతారు. దీంతో వారు ఏమి చేయలేని పరిస్థితుల్లో వెనుదిరుగుతారు.

నామమాత్రపు బహుమతులు.. 

తాము డ్రాలో సూచించిన వస్తువులను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడంతో కంపెనీ వారు తమకు తక్కువ ధరకు ఇస్తారని నిర్వాహకులు ప్రజలకు నచ్చజెప్పి వారిని సభ్యులుగా చేర్చుకుంటున్నారు. లక్కీ డ్రాలో  అందమైన బహుమతి వస్తుందని ఆశ చూపి, ఒకరి ఇద్దరికి మినహా మిగితా వారికి నామమాత్రపు బహుమతులను అంటగడుతున్నారని బాధితులు వాపోతున్నారు. సభ్యుల వద్ద వసూలు చేసిన మొత్తంలో కనీస విలువ చేసే బహుమతులను కూడా ఇవ్వడం లేదు. అదృష్టం ఉంటే కారు, జేసీబీ, ట్రాక్టర్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌, 80 బైక్‌లు, 5, 10 గ్రాముల బంగారం, ఎల్‌ఈడీ టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్లు  గెలుచుకోవచ్చనే ఆశతో అమాయక ప్రజలు ఈ స్కీమ్‌లో చేరుతున్నారు. ప్రారంభంలో కొన్ని నెలల పాటు చిన్న, చిన్న బహుమతులు ఇస్తూ సభ్యులను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏజెంట్లు, నిర్వాహకుల మాటలు నమ్మిన పేద, మధ్యతరగతి ప్రజలు చివరకు మోస పోతున్నారు. 

నమ్మించి మోసం చేశారు.. 

బోథ్‌లో ఓ ఎంటర్‌ప్రైజెస్‌ నిర్వాహకులు మొ దట్లో నమ్మకం కల్పించారు. లక్కీ డ్రాలో బ హుమతి రాకుంటే చివరి నెలలో హోండా బైక్‌ ఇ స్తామని చెప్పారు. నమ్మకంతో అందులో చేరా ను. నెలకు రూ. 1,150 చొప్పున చెల్లించాను. మొత్తం 15 నెలలు డబ్బులు కట్టాను. డ్రాలో బహుమతి రాలేదు. వారిని నిలదీయడంతో టీవీ ఇస్తామంటున్నారు. నా డబ్బులు తిరిగి చెల్లించాలని పట్టుబట్టాను. ఇంతవరకు డబ్బు లు ఇవ్వడం లేదు. 

- రవి, కుంటాల, మం: నేరడిగొండ  


logo