సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Feb 28, 2020 , T00:07

పల్లెప్రగతితో మరింత అభివృద్ధి

పల్లెప్రగతితో మరింత అభివృద్ధి

నార్నూర్‌ : సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలని, పల్లెప్రగతిలో చేపట్టే పనులపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌, ఫ్లయింగ్‌స్కాడ్‌ అధికారిణి యోగితారాణా అన్నారు. కలెక్టర్‌ శ్రీదేవసేనతో కలిసి స్థానిక ఎం పీడీవో కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు విడుతల్లో చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంపై పంచాయతీల వారీగా నివేదికలను పరిశీలిస్తూ సూచనలు చేశారు. అనంతరం మండలంలోని ఝరి, సావ్‌ర్రీ, లోకారి(కే)గ్రామాల్లో పర్యటించారు. గ్రామంలో డంపింగ్‌ యార్డు, శ్మశానవాటికను పరిశీలించారు. గ్రామాల్లో కంపోస్టు, శ్మశానవాటిక, నర్సరీల పనులు వేగవం తం చేసేలా చూడాలన్నారు. నర్సరీ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలిథీన్‌ కవరులో మట్టితోపాటు నాణ్యమైన విత్తనాలు విత్తుకోవాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే మొక్కలు పెంచాలన్నారు. లక్ష్యం దిశగా పని చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించవద్దన్నారు. గ్రామాల్లో తడిపొడి చెత్త బుట్టలు పంపిణీ చేయడంతో అవి వినియోగిస్తున్నారా..? లేదా అంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ మెరుగైన వైద్యం అందించాలన్నారు.

సమస్యలు పరిష్కారించేలా చర్యలు తీసుకుంటాం

గాదిగూడ మండల పర్యటనలో భాగంగా ప్రజలు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలను కలెక్టర్‌ శ్రీదేవసేనకు అందజేశారు. స్పందించిన కలెక్టర్‌ సమస్యల పరిష్కారానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మొక్కనాటారు.  కార్యక్రమం లో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జడ్పీటీసీ మెస్రం గంగుబాయి, సర్పంచులు కొపడ మోతుబాయి, మెస్రం దేవ్‌రావ్‌, డీఆర్డీవో రాజేశ్వర్‌రాథోడ్‌, జడ్పీ సీఈ వో కిషన్‌, డీఎఫ్‌వో ప్రభాకర్‌రెడ్డి, ఉట్నూర్‌ ఆర్డీవో వినోద్‌కుమార్‌, డీఎంహెచ్‌వో తొడసం చందు, ఎస్‌ఈ ఉత్తమ్‌ఝాడే, ఎంపీడీవో రామేశ్వర్‌, తహసీల్దార్‌ మోతీరాం,డీడీ చందన, ఏటీడీవో చంద్రమోహన్‌, ఏపీడీ శ్రీధర్‌స్వామి,డీఎల్‌పీవో భిక్షపతి, ఐటీడీఏ డీఈ తానాజీ, టీఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాస్‌, సీడీపీవో ఉమాదేవి, ఈజీఎస్‌ ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.


logo