బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 12, 2020 , 23:01:10

వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : వాహనదారులు నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని ట్రాఫిక్‌ సీఐ ప్రసాదరావు అన్నారు. బుధవారం పట్టణంలోని పలు కూడళ్ల వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ సీఐ మాట్లాడుతూ.. ప్రమాదాల నియంత్రణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీకుంటున్నట్లు తెలిపారు. ఎస్పీ విష్ణువారియర్‌ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆటో, జీపు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అతివేగం ప్రమాదకరమని, వాహనాల్లో పరితికిమించి ప్రయాణికులను తరలించవద్దని సూచించారు. ప్రయాణికులతో డ్రైవర్లు మర్యాదగా ప్రవర్తించాలని, వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని అన్నారు. ఆటో, జీపుల్లో ప్రయాణికులు విలువైన వస్తువులు మర్చిపోతే సమీప పోలీసు స్టేషన్‌లో అప్పజెప్పాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్సై రామారావు, కానిస్టేబుళ్లు రామన్న, సంతోష్‌, గణేశ్‌, నవీన్‌, అశోక్‌, పొచ్చన్న పాల్గొన్నారు. 


logo