బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 07, 2020 , 23:57:31

నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

తాంసి : జిల్లాలోని ప్రాథమిక సహాకార సంఘాల ఎన్నికలకు సంబంధించి రెండో రోజు భారీగా నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. శుక్రవారం జిల్లాలోని 28 ప్రాథమిక సహకార సంఘాలన్నింటికీ కలిపి 203 నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. మొదటి రోజు 39 నామినేషన్లు రాగా.. మొత్తం 242 నామినేషన్లు వచ్చాయి. శనివారం చివరి రోజు కావడంతో మిగిలిన వార్డులకు భారీగా  నామినేషన్‌లు వచ్చే అవకాశం ఉంది. 

రెండో రోజు 203 నామినేషన్లు

జిల్లాలోని పీఏసీఎస్‌లకు రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం కేవలం 39 నామినేషన్లు రాగా.. రెండో రోజు 203 నామినేషన్లు వచ్చాయి.  పీఏసీఎస్‌ చాంద(టి)లో14 , ఆదిలాబాద్‌లో 12, లాండసాంగ్వీ7 తలమడుగులో 25, తాంసి13 , జామిడి 2, జైనథ్‌ 7, మేడిగూడ 8,  గుడిహత్నూర్‌ 19,బేలా 10, డోప్టాల 28, జామిడి బి 6, ఇచ్చోడ 5, బోథ్‌ 4, ఉట్నూర్‌ 9, ఇంద్రవెల్లి 7, ముక్రా1, మాన్కాపూర్‌1,  మన్నూర్‌ 4, నేరడిగొండ 6, కుమారి 4, బజార్‌హత్నూర్‌4, నార్నూర్‌లో 4 చొప్పున దాఖలు అయ్యాయి.

ఏకగ్రీవాలకే మొగ్గు...

జిల్లాలోని పీఏసీఎస్‌ డైరెక్టర్‌లను పెద్దమొత్తంలో ఏకగ్రీవం చేసేందుకు  టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా నాయకులకు బాధ్యతలు అప్పగించి ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొన్ని సంఘాలు మినహాయించి ఎక్కవ పీఏసీఎస్‌లలోని వార్డుల్లో ఒక్కో నామినేషన్‌ దాఖలు అయ్యేలా ప్రయత్నిస్తున్నారు. 28 సంఘాల్లో మోజార్టీ స్థానాలకు కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌, బీజేపీలకు పలుచోట్ల అభ్యర్థులు కరువవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహాలు పనిచేస్తున్నాయి. ఒకటో రెండో వారికి కేటాయించి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తానికి జిల్లాలోని డీసీసీబీపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం

ప్రాథమిక సహకార సంఘం ఎన్నికలకు మరో వారం రోజులు సమయం ఉండడంతో జిల్లా సహకార శాఖ అధికారులు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించే పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. 


logo