
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 19: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు రద్దు చేయడంతో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతుల విజయంగా భావిస్తున్నామని చెప్పారు. రైతుల నిరవధిక ఉద్యమాలతో కేంద్రం దిగివచ్చిందన్నారు.
అందరి విజయం
ఎదులాపురం, నవంబర్ 19: కొత్త వ్యవసాయ చట్టాల రద్దును స్వాగతిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది దేశ రైతాంగం విజయంగా భావిస్తున్నామన్నారు. అలాగే విద్యుత్ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, నాయకులు బోరన్న, లోకరి పోశెట్టి, కొండ రమేశ్, చిలుక దేవీదాస్ పాల్గొన్నారు.
రైతులే గెలిచారు
బేల, నవంబర్ 19 : వ్యవసాయ చట్టాల రద్దుతో కేంద్రంపై రైతులే గెలిచారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు , రైతులతో కలిసి పటాకులు కాల్చారు. యాసంగిలో రైతులు పండించే వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జక్కుల మధుకర్, టీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, మస్కేతేజ్రావు, సతీశ్ పవార్, దీపక్‌గౌడ్, బాల్‌చందర్, సంతోష్ బెదుడ్కర్, రైతులు ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
బజార్హత్నూర్, నవంబర్19 : కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం అన్నారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల సహకారంతో రైతులు విజయం సాధించారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాశ్, పరమేశ్వర్, రాజు, జాంసింగ్, మహేశ్‌బాబు పాల్గొన్నారు.