15 నుంచి రూ.లక్ష ఆర్థికసాయం
బీసీ కుల వృత్తుల వారికి ఈ నెల 15 నుంచి రూ.లక్ష ఆర్థికసాయం చెక్కులను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులకు ఆర్థికసాయం పథకం
- రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్
- కలెక్టర్లు, అధికారులతో వీసీ
ఎదులాపురం, జూలై 13 : బీసీ కుల వృత్తుల వారికి ఈ నెల 15 నుంచి రూ.లక్ష ఆర్థికసాయం చెక్కులను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులకు ఆర్థికసాయం పథకం అమలుపై గురువారం బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్ర వెంకటేశంతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదని తెలిపారు.
కుల, చేతి వృత్తులు చేసుకునే వారికి ప్రోత్సాహం అందిస్తే ఆర్థికంగా ఎదుగుతారనే ఉద్దేశంతో రూ.లక్ష గ్రాంట్ అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి తెలిపారు. జూన్ 9న దీన్ని లాంఛనంగా ప్రారంభించారుని గుర్తుచేశారు. జూన్ 20 వరకు బీసీ కుల వృత్తులకు ఆర్థిక సాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు స్వీకరించామని, వీటిలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సహాయం అందే వరకు ఈ పథకం కొనసాగుతుందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 15 నుంచి బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే సమక్షంలో ప్రారంభించాలన్నారు. అనంతరం కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలతో సమీక్షించారు. ఈ సమావేశంలో డీబీసీడీవో రాజలింగు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

