ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చెక్కుల అందజేత
ఆసిఫాబాద్,ఆగస్టు14 : అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసాను ఇ స్తున్నదని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు శనివారం అందజేశారు. రెబ్బెనకు చెందిన షేక్ అలాద్దీన్‌కు రూ. 32 వేలు, విశాల్‌కు రూ. 30 వేలు, మైసయ్యకు రూ. 27 వేలు, మహేశ్‌కు రూ. 11 వేలు, కెరమెరికి చెందిన పరమేశ్వర్‌కు రూ. 13 వేలు, రాంసింగ్‌కు రూ. 17 వేలు, శంకర్‌కు రూ. 24 వేలు, వాంకిడికి చెందిన ఆరుణకు రూ. 40, 500, ఆసిఫాబాద్‌కు చెందిన ఖైరున్నికి రూ. 56 వేలు, పెంటయ్యకు రూ. 25 వేలు, తిర్యాణికి చెం దిన లావణ్యకు రూ. 41 వేలు, పెంటుకు రూ. 18,500, లావణ్యకు రూ. 18 వేలు, చిన్నయ్య రూ. 17 వేలు, తులసీకి రూ. 17 వేల చొప్పున మంజూరయ్యాయని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభు త్వం అన్ని వర్గాల సం క్షే మం కోసం పాటుపడుతున్నదని చెప్పారు. మాజీ ఎంపీపీ బొ మ్మెన బా లేశ్వర్గౌడ్, నాయకులు సోమేశ్వర్ పాల్గొన్నారు.