జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు
సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రతిభ చూపిన వారికి ప్రశంసాపత్రాలు
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 13 : విద్యార్థులే భవిష్యత్ శాస్త్రవేత్తలని డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో నిర్వహించిన ఇన్స్పైర్ 2019, జవహర్ లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్ 2020లలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ పంపిన ప్రశంసా పత్రాలను ఆయన శుక్రవారం డీఈవో కార్యాలయ ఆవరణలో శుక్రవారం అందజేశారు. నూతన ఆవిష్కరణలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న విద్యార్థులను, గైడ్ చేస్తున్న ఉపాధ్యాయులను, పాఠశాల హెచ్ఎంలను అభినందించారు. జాతీయ స్థాయికి ఎంపికైన జిమ్మిడి అం జన్న (మల్కపల్లి ఆశ్రమ పాఠశాల), స్వర్ణలత(బూర్గుపల్లి ప్రాథమికొన్నత పాఠశాల)లను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రశంసా పత్రాలు పొందిన వారిలో జవహర్ లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్ 2020లో ఆరుగురు, ఇన్స్పైర్ అవార్డు మనక్ – 2019లో 12 మంది ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, జిల్లా సమన్వయ కర్తలు సఫ్దర్ అలీఖాన్, శ్రీనివాస్, పద్మజ, చౌదరి, ఎంఈవో పోచయ్య, గైడ్ ఉపాధ్యాయులున్నారు.