హాజీపూర్, అక్టోబర్ 21 : పోలీసుల అమరుల త్యాగాలు మరువలేనివని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ వెంకట్రాములు అన్నారు. సోమవారం గుడిపేట 13వ బెటాలియన్లో పోలీసు అమరులకు నివాళులర్పించారు. కమాండెంట్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అనేక మంది పోలీసులు వీర మరణం పొందారని, వారి త్యాగాలు మరవలేనివని పేర్కొన్నారు. అంతకుముందు పోలీసుల అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలో నిలిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వర్రావు, కాళిదాస్, బెటాలియన్ యూనిట్ వైద్యులు సంతోష్ సింగ్, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.