చెన్నూర్ రూరల్, సెప్టెంబర్ 12: చెన్నూర్ మండలంలో మూడో రోజు గణనాథుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని పుప్పాల హనుమాన్ మందిరంలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం వద్ద అన్నదానం చేశారు. రౌండ్ టెంపుల్ హనుమాన్ మందిరంలో ప్రతిష్ఠించిన గణపతి వద్ద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో గణపతి సహస్ర్తావర్తనం కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రసాద వితరణ చేశారు.
బెల్లంపల్లి పట్టణంలో..
బెల్లంపల్లిటౌన్, సెప్టెంబర్ 12 : బెల్లంపల్లి పట్టణంలోని పలు గణేశ్ మండపాల వద్ద అన్నదానాలు చేశారు. 11వ వార్డు ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై అన్నదానం ప్రారంభించారు.
గణేశ్ మండలి వద్ద ఎమ్మెల్యే పూజలు
సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 12: సీసీసీ నస్పూర్‌లోని వినాయక మండపాల వద్ద ఎమ్మెల్యే దివాకర్‌రావు పూజలు చేశారు. నాగార్జునకాలనీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు కుర్మిళ్ల అన్నపూర్ణ, బండి పద్మ, నాయకులు నీలం సదయ్య, మహేందర్‌రెడ్డి, వెంగళ కుమారస్వామి, గోపాల్‌రెడ్డి, కిరణ్, పాపిరెడ్డి, తిరుపతి, గంగయ్య, తిరుపతిరావు, శ్రీనివాస్, కుర్మిళ్ల మోహన్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.