
ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్
నిర్మల్ టౌన్, జనవరి 12: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2022 పూర్తయిన సందర్భంగా అర్హులందరికీ ఓటరు గుర్తింపుకార్డులను వెంటనే అందించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ జిల్లా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇటీవల సమగ్ర ఓటర్ల జాబితాను అన్ని జిల్లాలో అధికారికంగా ప్రకటించామని తెలిపారు. 18 ఏండ్లు నిండినవారికి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేశామని గుర్తు చేశారు. జాబితాలో పేర్లున్న వారికి గుర్తింపుకార్డులు ఇవ్వాలని ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. ఓటర్ల ప్రాధాన్యతపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో నమోదైన 3939 మంది కొత్త ఓటర్లకు ఈ నెల 25వ తేదీన గుర్తింపుకార్డులను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.