
మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో విగ్రహావిష్కరణ
నార్నూర్, జనవరి 12 : బహుజన బంజారా జాతిరత్నం, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి బానోతు జాలంసింగ్ అని, ఆయన సేవలు చిరస్మరణీయమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో జాలంసింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ భవనం, పల్లె ప్రకృతివనాన్ని జడ్పీ చైర్మన్లు కోవలక్ష్మి, రాథోడ్ జనార్దన్, విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. రూ.250 కోట్లతో గిరిజనుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, జంగుబాయి ఆలయ అభివృద్ధికి, జీవో నంబర్ 317 సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం మంత్రులు వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.50 లక్షల ప్రొసిడింగ్‌ను ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్‌కు అందించారు. అనంతరం మండలంలోని కొత్తపల్లి(హెచ్) బంజారా జాతీయ దీక్షభూమి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, మాజీ మంత్రి అమర్‌సింగ్ తిలావత్, మాజీ ఎంపీ గోడం నగేశ్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, ఉట్నూర్ జడ్పీటీసీ రాథోడ్ చారులత, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఆడ బోజారెడ్డి, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్, సర్పంచ్ బానోత్ గజానంద్‌నాయక్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, పీఆర్ ఎస్ఈ వెంకట్రావ్, రాథోడ్ గణేశ్, రాజ్‌కుమార్, సంజీవ్‌నాయక్, భారత్ వాగ్మారే, భారత్ చౌహాన్ పాల్గొన్నారు.