దహెగాం,జూన్17 : హత్తిని గ్రామంలో సోమవారం 124 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. ైగ్లెసిల్ పత్తి విత్తనాలు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మనోజ్రావు ఇంటికి వెళ్లి చూడగా, బండి సింహాద్రి ట్రాక్టర్లో పత్తి వితనాల బ్యాగులు లోడ్ చేస్తున్నాడు.
వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి రాజులునాయుడికి సమాచారమివ్వగా, వచ్చి పంచనామా చేశారు. పట్టుబడ్డ విత్తనాల విలువ రూ.3.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మనోజ్రావు, బండి సింహాద్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.