నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్
పలుచోట్ల టీఆర్ఎస్ వార్డు, గ్రామ కమిటీల ఎన్నిక
శ్రీరాంపూర్, సెప్టెంబర్ 11: టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం శ్రీరాంపూర్ కాలనీలో చైర్మన్ క్యాంపు కార్యాలయంలో నస్పూర్ 17వ వార్డు సర్వ సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు కృషి చేయాలని కోరారు. 17 వార్డు గాంధీనగర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎండీ రఫీఖ్ఖాన్, ఉపాధ్యక్షుడిగా తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బాసిక అశోక్, సంయుక్త కార్యదర్శిగా ఎస్ శ్రీనివాస్, కోశాధికారిగా రాజ్‌మహ్మద్, కార్యవర్గ సభ్యులుగా కే రాజయ్య, బీ రమేశ్, మహేశ్, జీ కిరణ్, కోడి శ్రీకాంత్, పున్నయ్య, మోతె కుమార్, నర్సయ్య, మల్లయ్యను నియమించినట్లు వార్డు ఇన్చార్జిలు ఎస్ వెంకటేశ్, మంద మల్లారెడ్డి, గుంట జగ్గయ్య, కమలాకర్‌రావు ప్రకటించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చిలుముల రాయమల్లు, కేతిరెడ్డి భరత్‌రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.
వేమనపల్లి మండలంలో..
వేమనపల్లి, సెప్టెంబరు 11 : మండలంలోని కేతనపల్లి టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్ ఆదేశాల మేరకు శనివారం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పురాణం లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా గురుండ్ల బుచ్చుమేర, ఉపాధ్యక్షుడిగా పినుమాండ్ల సంతోష్, కార్యదర్శిగా అనుమాండ్ల సంతోష్, సంయుక్త కార్యదర్శిగా చటారీ పున్నం, కోశాధికారిగా గుండు నారాయణ, కార్యవర్గ సభ్యులుగా బాపు, శంకర్, మధునయ్య, సత్యనారాయణ, రమేశ్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొద్దున శంకర్, నాయకులు వెంకటేశం, లచ్చయ్య, నాయకులు పాల్గొన్నారు.
నెన్నెల మండలంలో..
నెన్నెల, సెప్టెంబర్11: టీఆర్ఎస్ పార్టీ నెన్నెల గ్రామ కమిటీని అధ్యక్షుడిగా భీమరాజుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎనుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం భీమాగౌడ్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను అనుబంధ కమిటీలను నియమించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తిరుపతి, కోఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, కార్యకర్తలు పాల్గొన్నారు.
4వ వార్డు కమిటీ ఎన్నిక
బెల్లంపల్లిటౌన్,సెప్టెంబర్ 11: మున్సిపాలిటీ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ 4వ వార్డు కమిటీని శనివారం కౌన్సిలర్ షేక్ ఆస్మా ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. వార్డు కమిటీ అధ్యక్షుడిగా మహ్మద్ దస్తగిరి, యూత్ అధ్యక్షుడిగా షేక్ ఖాజా పాషా, మహిళా అధ్యక్షురాలిగా బెల్లంకొండ కళావతి, ఎస్సీ అధ్యక్షుడిగా విశాల్, బీసీ అధ్యక్షుడిగా దెబ్బటి సత్యనారాయణ, మైనా ర్టీ అధ్యక్షుడి4గా అబ్ధుల్ రహీంను ఎన్నుకున్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ బత్తుల సుదర్శన్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నూ నెటి సత్యనారాయణ, నెన్నెల మండల అధ్యక్షుడు గడ్డం భీమాగౌడ్, కౌన్సిలర్ భుక్యారాము నాయక్, నాయకులు నెల్లికంటి శ్రీధర్, రేవెల్లి విజయ్, బస్తీ కమిటీ సభ్యులున్నారు.
టీఆర్ఎస్ జన్నారం మండల కమిటీ ఎన్నిక
జన్నారం, సెప్టెంబర్ 11 : మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల స్థాయి కార్యకర్త సమావేశాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖానాయక్ సమక్షంలో నిర్వహించారు. పార్టీ మండల స్థాయి కమిటీలను ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా గుర్రం రాజారాంరెడ్డి(నాలుగోసారి), ప్రధాన కార్యదర్శిగా గొట్ల రాజేశ్‌యాదవ్, యూత్ అధ్యక్షుడిగా శ్రీనివాస్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలిగా సుశీల, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడిగా ఎంఏ రజాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.