
టీఆర్ఎస్ నాయకుడు జగదీశ్
లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
ఆదిలాబాద్ టౌన్, జనవరి 11 : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని టీఆర్ఎస్ నాయకుడు సెవ్వ జగదీశ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామంలో మంగళవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేశారని తెలిపారు. ఆడబిడ్డల పెళ్లిల కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అన్నదాతల సంక్షేమ కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి రైతుబాంధవుడిగా నిలిచాడని కొనియాడారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, పీఏసీఎస్ చైర్మన్ మెస్రం పరమేశ్వర్, సర్పంచ్ మడావి లక్ష్మీబాయి భీంరావ్, నాయకులు నరేశ్, రాజేశ్వర్, సురేశ్ పాల్గొన్నారు.
జైనథ్లో..
జైనథ్, జనవరి 11 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి దీపాయిగూడ గ్రామానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న కృషి వల్ల పేదలకు కల్యాణ లక్ష్మి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లు గంగన్న, ఉప సర్పంచ్ లోక కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అశోక్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.