మల్యాల, మార్చి 9 : జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో శనివారం ట్రా లీ ఆటో బోల్తాపడగా, మంచిర్యాల జిల్లా కు చెందిన 11మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని మ్యాదరిపేటకు చెందిన గంధం జగన్ కు టుంబసభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి ట్రాలీ ఆటోలో కొండగట్టు హనుమాన్ ఆలయానికి చేరుకున్నాడు.
స్వామివారి దర్శనం తర్వాత శనివారం ఉద యం ట్రాలీ ఆటోలో కొండఘాట్రోడ్డు మార్గం లో తిరుగుపయనమయ్యారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆటో అదుపుతప్పి రోడ్డు సైడ్వాల్ను ఢీకొట్టి బోల్తాపడ్డది. ఈ ఘటనలో జగన్తో పాటు 10 మంది గాయపడ్డారు. చికిత్సకోసం ‘108’లో జగిత్యాల దవాఖానకు తరలించారు.