
భీంపూర్, నవంబర్10 : మండలంలోని వడ్గాం, అందర్బంద్, భగవాన్పుర, భీంపూర్ తదితర గ్రామాల్లో పోడు భూములకు హక్కు పత్రాల కోసం బుధవారం దరఖాస్తులు స్వీకరించారు. ఆయా కమిటీల చైర్మన్లు, సభ్యులు రైతుల నుంచి అర్జీలు స్వీకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. కార్యక్రమాల్లో సర్పంచులు రేష్మా, చిన్ను, రూప ,మడావి లింబాజీ, పెండెపు కృష్ణ యాదవ్ న్నారు.
ఇంద్రవెల్లి, నవంబర్ 10 : అటవీ భూములు సాగు చేస్తున్న రైతులు మాత్రమే పోడు హక్కు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ రాఘవేంద్రరావ్ అన్నారు. దస్నాపూర్లో గిరిజన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అటవీ భూములు సాగు చేస్తున్న రైతులు మాత్రమే పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. అటవీ భూములు సాగు చేస్తున్న రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, సర్పంచ్ జావదే పార్వతీబాయి, పుండలిక్ పటేల్, గ్రామస్తులు జావదే కేశవ్, పోటే సాయినాథ్, మారుతి, సంతోష్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ హయాంలోనే గిరిజనుకు మేలు
ఉట్నూర్ రూరల్, నవంబర్ 10: టీఆర్ఎస్ హయాంలోనే గిరిజనులకు మేలు జరిగిందని ఎంపీపీ పంద్ర జైవంత్రావు అన్నారు. మండలంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీ పరిధి సంభుగూడలో గ్రామ కమిటీని అధికారుల సమక్షంలో బుధవారం ఎన్నుకున్నారు. చైర్మన్గా ఆత్రం పరశురాం, కార్యదర్శిగా ఆడ రాజుతో పాటు సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. పోడు భూముల పంపిణీతో గిరిజన కుంటుంబాలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పోడు రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే న్యాయం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్వో గోవింద్రావు, పంచాయతీ కార్యదర్శి రాధేశ్యాం, పీసా మొబిలైజర్ కౌసల్య, గ్రామస్తులు పాల్గొన్నారు.