
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
32 మందికి చెక్కుల పంపిణీ
బజార్హత్నూర్, జనవరి 10 : పేదింటి ఆడబిడ్డలకు భరోసాగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిలుస్తున్నాయని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలకేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కూన గంగాధర్ ఆధ్వర్యంలో 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి ఖర్చులకోసం ఇస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఎంతో గానో ఉపయోగపడుతున్నదని తెలిపారు. సర్పంచ్ లావణ్య, మండల కన్వీనర్ రాజారాం, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కైలాస్, నాయకులు చంద్రశేఖర్, రమేశ్, సాయన్న, జగదీశ్వర్, శ్రీనివాస్, భాస్కర్‌రెడ్డి, లక్ష్మణ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
బోథ్ ఉర్దూ కళాశాలలో లెక్చరర్లను నియమించాలి
బోథ్, జనవరి 10 : బోథ్‌లోని ప్రభుత్వ ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలలో లెక్చరర్లను నియమించాలని కోరుతూ సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి సమస్యను పరిష్కరించాలని కోరారు. త్వరలోనే లెక్చరర్లను నియమించేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
క్రీడలతో మానసికోల్లాసం
ఇచ్చోడ, జనవరి 10 : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని సాత్నంబర్ గ్రామంలో జాదవ్ రవిరాజ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడలతో స్నేహ బంధాలు మెరుగవుతాయన్నారు. క్రీడలకు తెలంగాణ ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. అనంతరం క్రీడకారులను ఎమ్మెల్యే పరిచయం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఒక ఓవర్ క్రికెట్ ఆడారు. కార్యక్రమంలో నేరడిగొండ ఎంపీపీ రాథోడ్ సజన్, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, సోషల్ మీడియా కన్వీనర్ దాసరి భాస్కర్, గాయక్వాడ్ గణేశ్, రాథోడ్ ప్రకాశ్, రాథోడ్ ప్రవీణ్, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతోనే జీవన క్రమశిక్షణ
బేల, జనవరి 10 : ఆధ్యాత్మికత బాటతో సగటు మనిషిలో క్రమశిక్షణ, సంస్కారం అలవడుతుందని, తద్వారా మంచి యోచనలతో పనులు చేస్తారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. బేల మండలంలోని కాప్సి గ్రామంలో బాలాజీ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి భజనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను స్థానికులు సన్మానించారు. సీఎం కేసీఆర్‌తోనే అన్ని మతాల సంస్కృతికి వన్నె వచ్చిందని గుర్తుచేశారు. రైతుబంధు సీఎం కేసీఆర్ అనే దేవుడు అన్నదాతకు ఇచ్చిన అమూల్య వరమన్నారు. ఎమ్మెల్యేతో సర్పంచ్ ఇంద్రశేఖర్, నాయకులు దేవన్న, జితేందర్, ఆశన్న, దత్తా, మోహన్, ఖయ్యర్, సందీప్ పాల్గొన్నారు.