
రూ. 8 కోట్లతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు
పనుల పురోగతిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష
నిర్మల్ అర్బన్, ఆగస్టు 9 : బాసరను ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలోని ప్రధాన ఆలయాల అ భివృద్ధి పనులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం అరణ్యభవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు విడి ది, క్యూ కాంప్లెక్స్‌లు, తాగునీరు, షాపింగ్ కాంప్లెక్స్ తదితర సౌ కర్యాలను కల్పించడంతోపాటు నది పరీవాహక ప్రాంతాన్ని సుందరీకరించాలని, గోదావరి నదికి హారతినిచ్చే ప్రాంతాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని, బోటింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎకో టూరిజంతోపాటు టెంపుల్ టూరిజానికి కూడా జనం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొంటూ, ఇం దుకు తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం,అడెల్లి పోచమ్మ, కాల్వ శ్రీ లక్ష్మీనరసింహస్వామి, కదిలి శ్రీ పాపహరేశ్వర స్వామి తదితర ఆలయాల అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన చర్చించారు. ఆయా ఆలయాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, త్వరలో చేపట్టనున్న పనులను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతోపాటు మానసిక ఆహ్లాదం కలిగించేలా ఆలయాల పరిసరాలను తీర్చిదిద్దాలని ఆదేశించారు.
ఎకో టూరిజంతోపాటు టెంపుల్ టూరిజానికి కూడా జనం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ర్టాలనుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని సదుపాయాలు కల్పించేందుకు దీర్ఘకాల ప్రణాళికలు రూపొందించాలన్నారు. బాసరలో ఆధ్యాత్మిక టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. బాసరలో రూ.8 కోట్లతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆలయ శిల్పుల సహకారంతో డిజైన్లు రూపొందించి, అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. అడెల్లి, కాల్వ, కదిలి ఆలయాల అభివృద్ధి పనులు సైతం త్వరగా పూర్తిచేయాలని, అడెల్లి ఆలయ విస్తరణ పనులకు కావాల్సిన భూసేకరణకు ప్రతిపాదనలు రూపొందించిన కలెక్టర్‌కు అందించాలన్నారు.
పుణ్యస్నానాలకు ప్రత్యేకంగా షవర్లు ఏర్పాటు చేయాలని, కోనేటిలో స్వచ్ఛమైన నీరు ఉండే లా చూడాలని స్పష్టంచేశారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని, అంతర్గత రోడ్ల విస్తరణ, పిల్లలకు ఆట స్థలం, భక్తులకు వి డిది గృహాలు, వీఐపీ అతిథి గృహాలు, బయో టాయిలెట్లు ని ర్మించాలని కోరారు. కాల్వ దేవస్థానంలో కోనేటిని అభివృద్ధి పర్చడంతోపాటు భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయాల్లో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు దాతలు ముందు కు రావాలని మంత్రి విజ్ఞప్తిచేశారు. సమీక్షలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, స్తపతి శ్రీవల్లినాయగం, సీఈ జీ. సీతారాములు, బాసర ఈవో వినోద్ రెడ్డి పాల్గొన్నారు.