
గౌడ, ఎస్సీ, ఎస్టీలకు 57 దుకాణాల కేటాయింపు
మిగతావి జనరల్ విభాగంలో టెండర్‌కు అవకాశం
లాటరీ పద్ధతిన ఎంపిక చేసిన ఆయా జిల్లాల కలెక్టర్లు
ఎదులాపురం, నవంబర్ 8 : జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో సంక్షేమ శాఖల అధికారుల సమక్షంలో మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కమిషనర్ , ఎక్సై జ్ శాఖ వారు జిల్లాకు 40 దుకాణాలను కేటాయించారన్నారు. అందులో షెడ్యూల్డ్ తెగల వారికి 9 షాపులు, షెడ్యూల్డ్ కు లాల వారికి 5 , గౌడ కులస్తులకు ఒకటి కేటాయించామన్నా రు. జిల్లా ప్రొబిషన్, ఎక్సైజ్ అధికారి ఎస్.రావీందర్ రాజు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత, జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి రాజలింగం, సహాయ గిరిజన సంక్షేమ అధికారి ప్రణయ్, సీఐ సీహెచ్.శ్రీనివాస్, ఉట్నూర్ సీఐ మంగమ్మ, ఎస్ఐ కే. అరుణ్ కుమార్, కార్యాలయ పర్యవేక్షకుడు ఇమ్మాన్యూయల్ పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల అర్బన్, నవంబర్ 8 : జిల్లాలోని మద్యం దుకాణాలకు రిజర్వేషన్ లాటరీ పద్ధతి ద్వారా రిజరేషన్లు కేటాయించామని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రిజర్వేషన్ ఖరారు ప్రక్రియను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 73 ఏ4 వైన్‌షాపుల్లో గౌడ కులస్తులకు 6 వైన్ షాపులు, షెడ్యూల్డ్ కులాల వారికి 10, షెడ్యూల్డ్ తెగల వారికి ఆరు షాపులు రిజర్వ్ చేశామని చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియోలో చిత్రీకరించామని పేర్కొన్నారు. జిల్లాలో ఎస్టీ నోటిఫైడ్ ప్రాంతాలు ఉన్నందున ఎస్టీలకు ఆరు షాపులు రిజర్వ్ చేశామన్నారు. షెడ్యూల్డ్ కులాలు, గౌడ కులస్తులకు ఎంపిక ప్రక్రియను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సమక్షంలో నిర్వహించామని పేర్కొన్నారు. రిజర్వేషన్ లేని 51 షాపులకు అన్ని వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి నరేందర్, సహాయ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పీ రవీందర్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఖాజా నజీం ఆలీ అప్సర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో ..
నిర్మల్ టౌన్, నవంబర్ 8 : జిల్లాలోని వైన్‌షాపులకు రిజర్వేషన్లు కేటాయించినట్లు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించారు. 47 వైన్‌షాపుల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గౌడ కులస్తులకు మూడు, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1 రిజర్వు చేసి సద రు షాపులను లాటరీ ద్వారా కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు ఎన్.శ్రీనివాస్‌రెడ్డి, రాజలింగు, రాజేశ్వర్‌గౌడ్, ఎక్సైజ్‌శాఖ అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
ఆసిఫాబాద్, నవంబర్ 8 : జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సోమవారం లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 32 షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఇందులో ఎస్సీలకు 4, ఎస్టీ 1, గౌడ కులస్తులకు రెండు షాపులు కేటాయించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎక్సై జ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి రాజ్యలక్ష్మి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అధికారులు సజీవన్, సత్యనారాయణరెడ్డి, మణెమ్మ, సీఐలు మోసిన్, మహేందర్‌సింగ్ , సిబ్బంది పాల్గొన్నారు.