
ఉట్నూర్, జనవరి 8 : ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని ఐటీడీఏ ఇంజినీరింగ్ ఈఈ భీంరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఏమ్ఫర్ సేవా అనాథ ఆశ్రమంలో సన్‌షైన్ పాఠశాల విద్యార్థులు సొంత డబ్బులతో తీసుకువచ్చిన దుప్పట్లను పిల్లలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాడెంట్ షబ్బీర్, ఉపాధ్యాయులు మంజుల, ప్రభాకర్, వార్డెన్ మోతీరాం, విద్యార్థులు పాల్గొన్నారు.
గిరిజనులకు
యువ జనతా ఫౌండేషన్ చేయూత
బజార్హత్నూర్, జనవరి 8 : మండలంలోని డేడ్రా, తుకాన్పల్లి గ్రామాల గిరిజనులకు శనివారం హైదరాబాద్‌కు చెందిన యువ జనతా ఫౌండేషన్ సభ్యులు దుప్పట్లు పంపిణీ చేసి అండగా నిలిచారు. ఫౌండేషన్ సభ్యులు వారం క్రితం మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఫౌండేషన్ అధ్యక్షుడు బుద్ధార్తి నవీన్ వారికి ఏదైనా చేయాలని భావించి దుప్పట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్, సర్పంచ్‌లు భీంరావు, ఎంపీటీసీ లక్ష్మి, యువకులు శ్రీకాంత్, నరేశ్, ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.