
క్షయవ్యాధి నివారణపై అప్రమత్తం చేయాలి
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం, ఆగస్టు 7: క్షయ వ్యాధి నివారణకు ప్రణాళికలతో వివిధ శాఖల సమన్వయంతో గిరిజన ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో క్షయ వ్యాధి నివారణపై శనివారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించే సమయంలో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి నివారణకు చికిత్సలు అందించాలని తెలిపారు. పౌష్టికాహారం తీసుకొనేలా వివరించాలని, నిర్ణీత సమయానికి మందులు వేసుకునేలా తెలియజేయాలన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలపై దృష్టి పె ట్టాలన్నారు. గ్రామ పంచాయతీ అధికారులతో స మన్వయం చేసుకుంటూ వ్యాధి నివారణపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి ఆరు మాసాలకు సమావేశం కాకుండా నెలసరి సమీక్షలు నిర్వహించాలని, రోగుల ఇండ్లకు వెళ్లి వారికి కావాల్సి మందులు, పౌష్టికాహారం అందించాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి గ్రస్తులకు ఆరు మాసాల చికిత్స అందిస్తూ పర్యవేక్షణ చేయడం ద్వారా మరణాలను నివారించవచ్చని తెలిపారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యం, కమ్యూనిటీ సహకారంతో వ్యాధి ని అరికట్టవచ్చని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ జీ శ్రీగణ మాట్లాడుతూ.. ఫోరమ్ లక్ష్యాలు, ప్రణాళికలు వివరిస్తూ వ్యాధి నిర్ములనలో ఎదురయ్యే అవాంతరాలు, జిల్లా ప్రగతి, తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో డాక్టర్లు విద్యావిల్సన్, జమీర్, ఈశ్వర్రాజ్, సందీప్జాదవ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ శ్రీకాంత్, జిల్లా టీబీ కో ఆర్టినేటర్ చెన్నమల్లయ్య పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణకు గతంలో మాదిరిగా అధికారులు వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్య అతిథి ప్రసంగం సిద్ధం చేయడానికి జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సంక్షిప్త నోట్ జిల్లా పౌర సంబంధాల అధికారికి పంపించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, ఎం.డేవిడ్, ఆర్డీవో జాడి రాజేశ్వర్, డీఆర్డీవో కిషన్, జడ్పీ సీఈవో గణపతి, డీఈవో రవీందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.