
రాష్ట్రంలో 79.41 శాతం మార్కులతో రెండో స్థానం
వరించిన కాయకల్ప అవార్డు, ఎన్‌క్వాస్ సర్టిఫికెట్
విశిష్ట సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు
వైద్యుల సమష్టి కృషి ఫలితం
పచ్చదనం, పరిశుభ్రత, వైద్యుల పనితీరుకు నిదర్శనం
దస్తురాబాద్, అక్టోబర్ 3 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ పీహెచ్సీ రెండేండ్లలో రెండు అవార్డులు దక్కించుకున్నది. 2020-21 సంవత్సరానికిగాను వైద్యుల సేవలు, పారిశుధ్య నిర్వహణకు గుర్తింపుగా వైద్య ఆరోగ్య శాఖ కాయకల్ప అవార్డు అందించింది. 2021-22 సంవత్సరానికిగాను పీహెచ్సీలో ఉత్తమ సేవలు అందించే ప్రభుత్వ దవాఖానలకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) సర్టిఫికెట్ లభించింది. రాష్ట్రంలోని 3 పీహెచ్‌సీలను ఇటీవలే కేంద్రం ఎంపిక చేయగా, దస్తురాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 79.41 శాతం మార్కులతో రెండో స్థానంలో నిలిచింది. సిబ్బంది సమష్టి కృషి ఫలితంగా వరుసగా రెండేళ్లలో ఘనత సాధించడంపై హర్షం వ్యక్తమవుతున్నది.
ప్రభుత్వ దవాఖానలు గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు కార్పొరేట్‌కు దీటుగా సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే నిధులను వినియోగించుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. ఇందులో భాగంగానే దస్తురాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2020-21 సంవత్సరానికి గాను పారిశుధ్య నిర్వహణ, వైద్యుల సేవలకు గుర్తింపుగా వైద్య ఆరోగ్య శాఖ కాయకల్ప అవార్డు వరించింది. 2021-22 సంవత్సరానికి గాను పీహెచ్సీలో ఉత్తమ సేవలు అందించే ప్రభుత్వ దవాఖానలకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) సర్టిఫికెట్ లభించింది. జిల్లా సరిహద్దు మండలమైన దస్తురాబాద్ పీహెచ్‌సీకి రెండేండ్లలో రెండు అవార్డులు రావడం విశేషం. ఇది వైద్యుల పనితీరుకు దక్కిన గుర్తింపు. అప్పటి జిల్లా వైద్య శాఖ అధికారిగా ఉన్న వసంతరావు ఈ అవార్డులు రావడానికి ఎంతో కృషి చేశారు. కాయకల్ప అవార్డుకు ఎంపిక కావడానికి చాలాసార్లు పీహెచ్‌సీని సందర్శించి వైద్య సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇస్తూ ప్రోత్సహించారు. ప్రస్తుతం జిల్లా వైద్య శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ధన్రాజు కూడా పీహెచ్‌సీకి అవార్డు రావడంలో కీలకపాత్ర పోషించారు.
పీహెచ్‌సీకి రెండోస్థానం..
ప్రభుత్వ దవాఖానలో అన్ని సౌకర్యాలు, సిబ్బంది పనితీరును చూసి కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎన్‌క్వాస్ (జాతీయ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) సర్టిఫికెట్ అందజేస్తుంది. రాష్ట్రంలోని 3 పీహెచ్‌సీలను ఎంపిక చేసినట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఖమ్మం జిల్లా బొనకల్ పీహెచ్సీ 93.49 మార్కులతో మొదటి స్థానంలో ఉండగా, నిర్మల్ జిల్లా దస్తురాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 79.41 శాతం మార్కులతో రెండో స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లా చిట్యాల్ 78.17 శాతం మార్కులతో మూడో స్థానం దక్కించుకుంది.
12 అంశాల పరిశీలన..
నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్ సర్టిఫికెట్ పొందడంలో భాగంగా జూలై 13వ తేదీన వర్చువల్ పద్ధతిలో ఢిల్లీ నుంచి నే షనల్ అస్యూరెన్స్ టీం సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో అందిస్తున్న సేవలపై ఆరాతీశారు. వైద్య ఆరోగ్యశాఖలో ఉ న్న ఆరు డిపార్ట్మెంట్లలోని 12 ప్రధాన అంశాల్లోని సారాంశా న్ని పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమలవుతు న్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, పరిశుభ్రత, పచ్చదనం, మౌ లిక సదుపాయాలు, ఫార్మసీ, వ్యాక్సిన్ నిల్వలు, ల్యాబ్‌లో పరీక్షల నిర్వహణ, బాలింతలు, గర్భిణులు, దవాఖాన నిర్వహణ, అం దిస్తున్న సేవలు, వైద్యుల పనితీరును పరిగణనలోకి తీసుకున్నారు. ఒక్కొక్క అంశాన్ని పరిశీలించి ఎంపిక చేశారు.
ఏడాదికే సర్టిఫికెట్..
పీహెచ్‌సీకి ఒక సంవత్సరం వరకే ఈ సర్టిఫికెట్‌ను అందజేసినట్లు వైద్యురాలు కిరణ్మయి తెలిపారు. దవాఖానలో కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో మూడేండ్లకు ఇచ్చే సర్టిఫికెట్‌ను ఏడాదికే ఇచ్చారని పేర్కొన్నారు. పీహెచ్‌సీని కేంద్ర బృందం ఆన్లైన్లో పరిశీలించారని, త్వరలోనే కేంద్ర బృందం నేరుగా సందర్శించి పూర్తిస్థాయి సర్టిఫికెట్ అందిస్తారని ఆమె పేర్కొన్నారు. పీహెచ్సీ అవార్డుకు ఎంపికయ్యేలా కృషి చేసిన వైద్యురాలు కిరణ్మయి, సుధాకర్, హెచ్‌ఈవో వేణుగోపాల్, సీనియర్ అసిస్టెంట్ మురళీకృష్ణ, క్వాలిటీ మేనేజర్ ధరమ్‌సింగ్, హెచ్వీ గంగుబాయి, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలను జిల్లా వైద్య శా ఖ అధికారులు, మండల ప్రజాప్రతినిధులు అభినందించారు.
సమష్టి కృషితో దక్కిన గుర్తింపు
మండలంలోని ప్రజాప్రతినిధులు, దవాఖాన వైద్య సి బ్బంది టీం వర్క్, సమష్టి కృషితో దక్కిన గుర్తిం పు ఇది. పీహెచ్‌సీకి ఎన్‌క్వాస్ సర్టిఫికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది. అంకితభావంతో రోగులకు అందిస్తున్న వైద్య సేవ లు, దవాఖాన అభివృద్ధికి చేసిన కృషికి, కష్టపడినందుకు ఈ అవార్డులు వచ్చా యి. ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది సహకారంతో పీహెచ్‌సీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. ఇదే స్ఫూర్తితో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం.