
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
బతుకమ్మ చీరెలు పంపిణీ
నిర్మల్ అర్బన్, అక్టోబర్3 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో మహిళలు, యువతులకు బతుకమ్మ చీరెలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సంస్కృతికి ప్రతిబింబాలు పండుగలని అన్నారు. 289 రకాల్లో సిరిసిల్ల నేతన్నలు బతుకమ్మ చీరెలను తయారు చేశారని తెలిపారు. నిర్మల్ పట్టణానికి చెందిన 33వేల మంది మహిళలకు బతుకమ్మ చీరెలు అందించనున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు మురళీధర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సోన్, అక్టోబర్ 3 : నిర్మల్ మండలం ఎల్లపెల్లి లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. జిల్లాకు 2,73,947 చీరెలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మద ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, సర్పంచ్ రవీందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, నిర్మల్ మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, సీనియర్ నాయకులు అల్లోల మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
నిర్మల్ అర్బన్, అక్టోబర్3 : పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలో ఇంటింటా చెత్త సేకరిస్తూ బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య సిబ్బంది దేవి అడెల్ల, తెడ్డు లక్ష్మి, నిగులపు రాజేశ్వర్, చాకలి సతీశ్‌ను మంత్రి అల్లోల ఆదివారం సన్మానించి ప్రశంసా పత్రాలు అందించారు. వారు చేస్తున్న సేవలను మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.