
ఇంద్రవెల్లి, అక్టోబర్ 3 : గ్రామీణ ప్రాంతం లోని ఆదివాసీ గిరిజన యువత ఉన్నత చదువులు చదువుకుంటేనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొ న్నారు. మండలంలోని కెస్లాపూర్ గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాల యాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం నాగోబా ఆలయాన్ని సందర్శించి నాగోబాను దర్శించుకున్నారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. ముందుగా కెస్లాపూర్ గ్రామపటేల్ మెస్రం వెంకట్రావ్, సర్పంచ్ మెస్రం రేణుకా నాగ్నా థ్తోపాటు యూత్ సభ్యులు, గ్రామస్తుల ఆధ్వ ర్యంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్కు పుష్ప గుచ్ఛాలు అందించి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. సమాజంలో విద్యా చాలా ముఖ్యమైందన్నారు. సర్పంచ్ మెస్రం రేణు కానాగ్నాథ్ మాట్లాడుతూ.
తమకు ఉన్నచోటే డబుల్ బెడ్రూం ఇండ్లు, మినీ బస్టాండ్ మంజూ రు, గ్రామంలో సీసీ రోడ్లు, కెస్లాపూర్ నుంచి హర్కాపూర్ ఎక్స్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. స్పందించిన జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. మినీబస్టాండ్, రోడ్డు మంజూరుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రంథాలయంలో సామగ్రితోపాటు పుస్తకాలు ఏర్పాటుకు తన నిధుల నుంచి రూ. 50 వేలు అం దిస్తానని పేర్కొన్నారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, కెస్లాపూర్ గ్రామ పటేల్ మెస్రం వెంకట్రావ్ పటేల్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్రావ్, టీఆర్ఎస్ మాజీ మండ లాధ్యక్షుడు షేక్ సుఫియాన్, లక్కారాం మాజీ సర్పంచ్ మర్సుకోలా తిరుపతి, మెస్రం వంశీయు లు నాగ్నాథ్, ఆనంద్రావ్, యూత్ సభ్యులు షెగ్నాథ్, తోడసం సాగర్, గణేశ్, జ్యోతిరాం, తదితరులు పాల్గొన్నారు.