
ఆదిలాబాద్ కాటన్‌కు అంతర్జాతీయ డిమాండ్
ఎక్స్‌పోర్ట్‌ను ప్రోత్సహించేందుకు కసరత్తు
పరిశ్రమలకు చేయూతనిచ్చేలా చర్యలు
ఆదిలాబాద్, అక్టోబర్ 2 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ కాటన్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉండగా, ఎగుమతులను మరింత పెంచేలా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల కలెక్టర్ వివిధ ఉత్పత్తిదారులు, పరిశ్రమల యజమానులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఇక్కడ పండే పత్తికి ఇప్పటికే ఆసియాలోనే గుర్తింపు ఉండగా, అధికారులు తీసుకుంటున్న చర్యలతో ఎక్స్‌పోర్ట్స్ మరింత పెరగడమే కాకుండా రైతులకు సైతం మంచి ధర వచ్చే అవకాశమున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు యే టా జూన్‌లో పత్తి విత్తనాలు వేయగా, అక్టోబర్ మొదటి వారంలో పంట దిగుబడులు ప్రారంభమవుతాయి. డిసెంబరులో పంట కాలవ్యవధి ముగిస్తుండగా, సాగునీటి సౌక ర్యం ఉన్న రైతులు జనవరి చివరి వరకు పంట ను ఉంచుతారు. ఈ ఏడాది జిల్లాలో 4,11, 574 ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. 34 లక్షల క్విం టాళ్ల వరకు దిగుబడులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఏడాది పత్తికి ప్రభుత్వం రూ.60 25 ప్రకటించగా, మార్కెట్లో ఎక్కు వ ధర ఉంది. జిల్లాలో పత్తి రైతులు నష్టపోకుం డా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. గతేడాది మద్దతు ధరతో సీసీఐ ద్వారా 22 ల క్షల క్వింటాళ్లను ప్రభుత్వం సేకరించింది. జి ల్లాలోని రైతులు ఈ సీజన్లో సాగు చేసిన పం ట ను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు త యారు చేశారు. జిల్లాలోని 9 మార్కెట్‌యార్డు ల్లో పత్తిని సేకరించనున్నారు. పత్తిని ప్రాసెసింగ్ చేసి బేళ్లుగా మార్చేందుకు జిన్నింగ్‌లను అద్దెకు తీసుకున్నారు. అయితే జిల్లాలో ఇటీవల కురుసిన వర్షాల కారణంగా కొనుగోళ్లలో కొంత జాప్యం జరిగే అవకాశాలున్నాయి.
ఎగుమతులకు ప్రోత్సాహం
జిల్లాలో రైతులు పండించే పత్తికి ఆసియాలో మంచి పేరుంది. ఇక్కడి నేల స్వభావం, అనుకూలమైన వాతావరణం, సమృద్ధిగా వర్షాల కారణంగా పత్తి పింజ పొడవు ఎక్కువగా ఉండడంతో పాటు దారంతో పొడవు ఎక్కువగా వచ్చి నాణ్యతగా ఉంటుంది. దారం గట్టిగా వస్తుంది. దూది సైతం తెల్లగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఫలితంగా వ్యాపారులు ఆదిలాబాద్‌లో సాగు చేసే పత్తిని కొనేందుకు మొగ్గు చూ పుతారు. వాటిని చైనా, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. జిల్లాలో పత్తి ఎగుమతులు పెం చేలా అధికారులు చర్యలు చేపట్టారు. ‘ఆజాదికా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా వాణిజ్య ఉత్పత్తుల ఎగుమతులపై జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వివిధ ఉత్పత్తిదారులు, పరిశ్రమల యజమానులతో మూడ్రోజుల క్రితం జరిగిన సమావేశంలో అధికారులు పత్తి ఎగుమతులపై దృష్టి సారించాలని నిర్ణయించారు. జిన్నింగ్‌లో పనిచేసే సిబ్బంది నైపుణ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఇం దుకు అవసరమైన శిక్షణ ఇప్పించాలని కలెక్టర్ సూచించారు. దీంతో ఎగుమతిదారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. దీంతో రైతులకు సైతం ప్రయోజనాలు చేకూరనున్నాయి.