
జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
బతుకమ్మ చీరెలు పంపిణీ
నార్నూర్, అక్టోబర్ 2 : గ్రామస్వరాజ్యం దిశగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం ప్రాంగ ణంలో సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్ అధ్య క్షతన శనివారం గ్రామసభ నిర్వహించారు. దీనికి జడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువకులు, స్థానికులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం దిశగా రాష్ట్ర ప్రగతికి సీఎం బాటలు వేస్తున్నారని. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు, అభివృద్ధిని మన రాష్ట్రంలోనే ఉందన్నారు. 75 ఏళ్లలో జరగని ప్రగతి ఏండేళ్లలోనే కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నద ని పేర్కొన్నారు. పంచాయతీ సమస్యలతో పాటు నార్నూర్ మండల అభివృద్ధికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు సహకారంతో తనవంతు కృషి చేస్తామ న్నా రు. అనంతరం తెలంగాణ ఆడబిడ్డలకు బతుక మ్మ చీరెలు పంపిణీ చేశారు. మహిళలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచిం చారు. అంతకుముందు గాంధీచౌరస్తాలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఎంపీపీ కనక మోతుబాయి, ఐకేపీ ఏపీఎం రమేశ్, ఎంపీటీసీ టీ పరమేశ్వర్, నార్నూర్ సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, ఉప సర్పంచ్ చౌహాన్ మహేందర్, జీవ వైవిద్యా కమిటీ జిల్లా సభ్యుడు మర్సుకోల తిరుప తి, భీంపూర్ సర్పంచ్ రాథోడ్ విష్ణు, కోఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి, వార్డు సభ్యులు, నాయకులు, ఉన్నారు.