
ఎదులాపరం,అక్టోబర్2: మహాత్మా గాంధీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం గాంధీజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యన్ని సాధించుకున్నామని, ఆయన పోరాట ఫలితమే మనం ఆస్వాదిస్తున్నామని చెప్పారు. బాపూజీ ఆత్మకథ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని కోరారు. అహింసా మార్గాన్ని ఎంచుకొని నిత్యజీవితంలో సత్యం పలకాలన్నారు. వ్యక్తిగత జీవితంలో, అధికారిక విధుల్లో గాంధీజీ సూత్రాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎన్ నటరాజ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్ భీమ్ కుమార్, తహసీల్దార్ భోజన్న, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాజేశ్వర్, వర్ణ, స్వాతి, కలెక్టరేట్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్, సహకార ,రెవెన్యూ, ట్రైజరీ ,వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
మహాత్మాగాంధీ ఆలోచన విధానాలే నేటి ప్రపంచ ఆదర్శ సూత్రాలు అని జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్యకార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్ముడి జీవన విధానమే యావత్ ప్రపంచం ఆదర్శంగా తీసుకుంటున్నదని కొనియాడారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ జే కృష్ణమూర్తి, డీసీఆర్బీ సీఐ జాదవ్ గుణవంత్రావు, ఎస్ఐ సయ్యద్ అన్వర్ ఉల్ హక్, క్యాంపు కార్యనిర్వాహణాధికారి దుర్గం శ్రీనివాస్, పోలీసు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పట్టణ స్పెషల్ బ్రాంచ్ ఫీల్డ్ అధికారి జీఫోశెట్టి, ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత పాల్గొన్నారు.