
చెన్నూర్/ హాజీపూర్, ఫిబ్రవరి 1 : టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి,నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవా రం చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విప్‌ను శాలువా, పూలమాలతో సన్మానించారు. చెన్నూర్ యూనిట్ సంఘ భవన నిర్మాణానికి సహకరించాలని కోరారు. సమస్యలను విని సానుకూలంగా స్పందించినట్లు టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు తెలిపారు. అనంతరం సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో సంఘం కార్యదర్శి భూమూల రామ్మెహన్, చెన్నూర్ యూనిట్ అధ్యక్షుడు మామిళ్ళ రాజన్న, కోశాధికారి కరీం, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు నాగుల గోపాల్,అటవీశాఖ ఉద్యోగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పొన్న మల్లయ్య, సభ్యులున్నారు.
రేషన్ డీలర్ల సంఘం క్యాలెండర్ విడుదల
చెన్నూర్, ఫిబ్రవరి 1: చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమ న్ మంగళవారం రేషన్ డీలర్ల సంఘం కాల్యెండర్ను విడుదల చేశారు. అంతకుముందు
జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్ నియమితులైన సందర్భంగా రేషన్ డీలర్లు మర్యాద పూర్వకంగా పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బొమ్మ సత్యనారాయణరెడ్డి, కార్యదర్శి హైదర్, సభ్యులు జాఫర్, సురేశ్, పలువురు డీలర్లున్నారు.
కోటపల్లి మండలం నుంచి..
కోటపల్లి, ఫిబ్రవరి 1 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన బాల్క సుమన్‌ను కోటపల్లి మండల టీఆర్ఎస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పెద్దపోలు సాంబాగౌడ్ కొండంపేట ఎంపీటీసీ చంద్రగిరి శంకరయ్య, మండల యూత్ నాయకులు కామెర సమ్మయ్య, లాపాక రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.