సల్లంగ సూడు.. సారలమ్మ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో వనదేవతల జాతర వైభవంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం 4 గంటలకు సంప్రదాయరీతిలో గద్దెల వద్ద కోయ పూజారులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు.
- వైభవంగా వనదేవతల జాతర ప్రారంభం
- గోదారి తీరమంతా భక్తుల సందడి
- నేడు గద్దె పైకి సమ్మక్క తల్లి
- పోలీసుల పటిష్ట బందోబస్తు
మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 20: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో వనదేవతల జాతర వైభవంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం 4 గంటలకు సంప్రదాయరీతిలో గద్దెల వద్ద కోయ పూజారులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. మేడారానికి చెందిన గిరిజన పూజారి కృష్ణ దొర బృందం ఆధ్వర్యంలో సారలమ్మను డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో, పోలీసుల పహారా నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెలపై కొలువుదీర్చారు. భక్తులు అమ్మవారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇల్లారి (గుడి) నుంచి పడిగిద్ద రాజు, గోవిందరాజులను, గద్దెలపైకి తీసుకవచ్చి ప్రతిష్ఠిచారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి సారలమ్మను ద ర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
నేడు గద్దెలపైకి సమ్మక్క..
వనదేవతల జాతరలో భాగంగా గిరిజనుల ఇలవేల్పు సమ్మక్క తల్లి గద్దెల వద్దకు నేడు చేరుకోనుంది. ఇందుకోసం జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాలతో పాటు, మహారాష్ట్ర నుంచి అమ్మవార్లకు మొక్కులను తీర్చుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భక్తులకు పూర్తి ఏర్పాట్లు చేశారు. భక్తులు పుణ్య స్నానాలను ఆచరించడానికి ప్రత్యేకంగా నల్లాలు, గదులను ఏర్పాటు చేశారు. పారిశుధ్య చర్యలను చేపట్టారు. రామగుండం సీపీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ రాంనాథ్ కేకేన్ సూచనలతో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, జైపూర్ ఏసీపీ ఆరె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో..
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 21: జిల్లా కేంద్రంలోని పెద్దవాగు ఒడ్డున వెలిసిన సమ్మకకు ఎమ్మెల్యే కోవలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మొకులు చెల్లించుకున్నా రు. అమ్మవార్లకు బంగారం(బెల్లం)తో పాటు సారెను సమర్పించారు. మూడు రోజులపాటు జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

